Begin typing your search above and press return to search.
మోడీ కేసీఆర్ కామెంట్లపై అదిరిపోయే కామెంట్ చేసిన వీహెచ్
By: Tupaki Desk | 13 Feb 2022 11:00 AM ISTప్రధానమంత్రి నరేంద్ర మోడీపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ రేంజ్‌లో విరుచుకుపడుతుండటం, దీనికి స్పందనగా బీజేపీ నేతలు సైతం ప్రతిస్పందిస్తుండటం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టించిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని ఈ పొలిటికల్ వార్‌పై సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు కర్నూలులో స్పందించారు. మోడీ, కేసీఆర్ కొట్లాట డబ్ల్యు డబ్ల్యు ఎఫ్ ను తలపిస్తుందని వీహెచ్ ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కర్నూలు జిల్లాకు దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని సంజీవయ్య ఇంటి ఎదుట తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హనుమంతరావు ధర్నా నిర్వహించారు.
ఆయనతో పాటు మాజీ ఎంపీ హర్షకుమార్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమంతరావు హాట్ కామెంట్స్ చేశారు. ప్రధాని మోడీ పని పాట లేకుండా మాట్లాడుతున్నారని, లేనిపోని పంచాయతీలు పెడుతున్నారని వి. హనుమంతరావు అన్నారు. ఏమి చేశారో చెప్పకుండా రాష్ట్ర విభజనపై మోడీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో సుష్మా స్వరాజ్ కూడా సభలో ఉన్నారని అప్పుడు ఆమె ఏం చేశారని ప్రశ్నించారు
స్పెషల్ స్టేటస్ 10 ఏళ్ళు కావాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ బీజేపీ నేతలు ఇప్పుడు అధికారంలో ఉండి ఏం చేస్తున్నారని వీహెచ్ ప్రశ్నించారు.
కేసీఆర్ కు మోడీకి మంచి సంబంధాలు ఉండేవి… ఎక్కడి చెడిందో అని అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, తెలంగాణ కేసీఆర్ మధ్య గొడవ డబ్ల్యు డబ్ల్యు ఎఫ్ ను తలపిస్తుందని వీహెచ్ ఎద్దేవా చేశారు.