Begin typing your search above and press return to search.

స‌ర్వే పేరు చెప్పి కేసీఆర్ ను తిట్టిన వీహెచ్‌!

By:  Tupaki Desk   |   20 May 2018 8:52 AM GMT
స‌ర్వే పేరు చెప్పి కేసీఆర్ ను తిట్టిన వీహెచ్‌!
X
తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌కు మా గొప్ప చిక్కు వ‌చ్చింది. ఎన్నిక‌లకు ఏడాది మాత్ర‌మే ఉన్న‌ప్ప‌టికీ.. తెలంగాణ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డేందుకు అంశాల కోసం వెతుక్కుంటున్న ప‌రిస్థితి. అలా అని తెలంగాణ రాష్ట్రంలో ధ‌ర్మం నాలుగు పాదాల మీద న‌డుస్తుంద‌ని చెప్ప‌ట్లేదు. ప్ర‌జ‌ల‌కు స‌మ‌స్య‌లు లేక కాదు.. ప్ర‌భుత్వం త‌ప్పుడు నిర్ణ‌యం తీసుకోవ‌టం లేద‌ని కాదు. వాటిని గుర్తించ‌టం.. ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కు పెట్టే విష‌యంలో విప‌క్షాల వైఫ‌ల్యం కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

ఇలాంటి వేళ‌.. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీహెచ్ హ‌నుమంత‌రావుకు చ‌క్క‌టి పాయింట్ ప‌ట్టుకున్నారు. నిన్న‌ ఒక మీడియా సంస్థ ఒక స‌ర్వే రిపోర్ట‌ను ప‌బ్లిష్ చేసింది. అందులో తెలంగాణ‌లో అవినీతి ఎక్కువ‌న్నది సారాంశం. తెలంగాణ‌లో అవినీతి 73 శాతం ఉందంటూ రిపోర్ట్ చేయ‌టాన్ని వీహెచ్ ప్ర‌శ్నించారు. అన్నింట్లో నంబ‌ర్ 1 అని చెప్పే కేసీఆర్‌.. రాష్ట్రాన్ని అవినీతిలోనూ నెంబ‌ర్ వ‌న్ చేశార‌ని.. దీనికి స‌మాధానం ఏం చెబుతార‌ని మండిప‌డుతున్నారు.

ఎవ‌రైనా లంచం అడిగితే చెప్పుతో కొట్ట‌మ‌ని కేసీఆర్ కుమారుడు కేటీఆర్ చెప్పార‌ని.. ఇప్పుడు ఎవ‌రిని చెప్పుతో కొట్టాలంటూ క్వ‌శ్చ‌న్ చేశారు.

దేశంలో వివిధ రాష్ట్రాల్లో అవినీతికి సంబంధించి లెక్క‌లో తెలంగాణ‌కు రెండో స్థానంలో నిల‌వ‌గా.. ఏపీ నాలుగో స్థానంలో ఉన్న విష‌యాన్ని ప్ర‌స్తావించిన వీహెచ్.. ఈ వ్య‌వ‌హారం మీద కూడా దేశ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ ప్ర‌చారం చేసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఇప్ప‌టివ‌ర‌కూ అవినీతి అన్న‌ది రాష్ట్రంలో లేద‌ని.. నోరు క‌ట్టుకొని మ‌రీ క‌ష్ట‌ప‌డుతున్నామ‌ని గొప్ప‌గా చెప్పే కేసీఆర్‌.. తాజా స‌ర్వేపై ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌క‌రంగా మారింది.