Begin typing your search above and press return to search.
హన్మంతన్నా... కాంగ్రెస్ ఓడిస్తావా ఏంది?
By: Tupaki Desk | 6 Dec 2018 5:41 PM ISTకాంగ్రెస్ అంటే... సీల్డ్ కవర్ సీఎం. జాతీయ పార్టీ కాబట్టి ఈ బాధలు తప్పవు. రేపు పోలింగ్ జరగబోతున్న తెలంగాణ రాష్ట్రం లో నిన్నటి తో ప్రచారం ముగిసింది. కాంగ్రెస్ నేతలకు కాసింత తీరిక దొరికిందో లేదో... గెలుపోటముల గురించి కాకుండా ఏకంగా సీఎం సీటు గురించి డిస్కషన్లు పెట్టారు. ఇప్పటికే చాంతాడంత సీఎం అభ్యర్థుల లిస్టుతో కాంగ్రెస్ లో గందరగోళం ఉంది. దానికి ఈయన తనవంతు గందరగోళం సృష్టిస్తున్నాడు.
ప్రజా కూటమి గెలుస్తుందా? లేదా? అన్న విషయం చర్చించడం వదిలేసి... అదేదో ఆల్రెడీ గెలిచేసినట్టు సీఎం సీటు బలహీనవర్గాలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు వీహెచ్. సీఎం అభ్యర్థి అంటే ఏమయినా ప్రసాదమా? కావాల్సిన వారికి పంచిపెట్టడానికి... రాష్ట్రం భవిష్యత్తును నిర్ణయించే వ్యక్తి. తెలంగాణలో ఎవరికి వారు తమ అర్హతలు తెలుసుకోకుండా సీఎం సీటుపై ఖర్చీఫ్ వేసేస్తున్నారు. ఆ పెద్ద లిస్టులో మొన్న సబిత ఖర్చీఫ్ వేయగా... ఈ రోజు వీ హెచ్ ఖర్చీఫ్ వేశాడు. గెలిస్తే ఇంకా ఎన్ని ఖర్చీఫ్ లు వేస్తారో తెలియదు.
ఈ మధ్య సోషల్‌మీడియా లో ఒక పోస్టు వైరల్ అవుతోంది. *ఎంపిక సులువు* అనే శీర్షికతో కేసీఆర్ ఫొటో ఒక వైపు, కాంగ్రెస్ సీఎం సీటు ఆశావహులు పన్నెండు మంది ఒక వైపు ఉన్నారా చిత్రంలో. కాంగ్రెస్ రాజకీయానికి అది ఒక పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్. వీ హెచ్, సబిత వంటి వారి వ్యాఖ్యలు విన్నపుడు సామాన్యులకు ఈ కాంగ్రెస్ వస్తే ఇంతేరా నాయనా అనిపిస్తుంటుంది. గతం లో తెలుగుదేశం పార్టీ పుట్టింది కూడా కాంగ్రెస్ ఇలా సీఎంలను అడ్డదిడ్డంగా మార్చి వారికి కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదనే. అంటే మళ్లీ అదే పరిస్థితి పునరావృతం అవుతోందన్నమాట.
ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండోయ్... మొన్న పొరపాటున ఆజాద్... ఈ రోజు కేసీఆర్ సీఎం అయ్యారు, రేపు రేవంత్ సీఎం కావొచ్చు చెప్పలేం అని చేసిన వ్యాఖ్యలను కూడా వీ హెచ్ తప్పు పట్టారు. అరె బై ఎపుడూ రెడ్లేనా మాలాంటి బడుగోళ్లకు ఆ సీటు వద్దా అని కాస్త గట్టిగానే ఆవేదన వ్యక్తంచేశారు. రేపటి లోపు ఇట్లాంటి నాలుగైదు వార్తలు జనాల చెవిన పడితే... కాంగ్రెస్ కు బ్యాండ్ బాజానే.