Begin typing your search above and press return to search.
వీహెచ్ ఎంట్రీ!..బాబుకు కొండంత అండ!
By: Tupaki Desk | 30 March 2019 6:19 PM ISTఎన్నికల వేళ లెక్కలేనన్ని చిత్రాలు పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. అయితే ఈ ఎన్నికల్లో లెక్కలేనన్ని చిత్రాలు ఎంట్రీ ఇస్తుంటే... ఓ వైపు ఆశ్చర్యంతో పాటు మరోవైపు ఆసక్తి రేకెత్తుతోంది. ప్రధాన పార్టీల ముఖ్య నేతల నుంచి వస్తున్న వార్ ఆఫ్ వర్డ్స్‌తో ఒకింత సీరియస్ నెస్ వాతావరణం నెలకొంటుంటే... కేఏ పాల్ లాంటి నేతల ఎంట్రీతో ఆ సీరియస్ నెస్ నుంచి కాస్తంత రిలాక్స్ అయ్యే వీలు కూడా ఈ ఎన్నికల్లో ప్రత్యేకమనే చెప్పాలి. మొత్తంగా ఈ ఎన్నికలు గతంలో జరిగిన అన్ని ఎన్నికలకు భిన్నమనే చెప్పక తప్పదు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు మరో చిత్రం చోటుచేసుకుంది. ఆ చిత్రమేమిటంటే... తెలంగాణ ద్రోహిగా ముద్రపడిపోయిన టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు గట్టి మద్దతే కాకుండా కొండంత అండ కూడా దొరికేసింది. ఆ అండాదండా మరెవరో కాదు...తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన సీనియర్ మోస్ట్ నేత - ఆ పార్టీ రాజ్యసభ మాజీ సభ్యుడు వి. హన్మంతరావే.
వీహెచ్ గా అందరూ పిలుచుకునే ఈ నేత... ఇప్పుడు చంద్రబాబుకు తెలంగాణలో గట్టి మద్దతుగా నిలబడ్డారనే చెప్పాలి. టీడీపీ అంటేనే కారాలు మిరియాలు నూరే వీహెచ్ చంద్రబాబుకు అండగా నిలబడ్డారంటే నిజంగా ఆశ్చర్యమే కదా. సరే... గడచిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు అటు టీడీపీ కూడా తమ సైద్ధాంతిక విభేదాలను పక్కనపెట్టేసి జట్టు కట్టి బొక్క బోర్లా పడిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని ఆశించినా... తెలంగాణలో మాదిరే ఏపీలోనూ బొమ్మ కనిపిస్తుందన్న భయంతో కాంగ్రెస్ తో పొత్తుకు చంద్రబాబు ససేమిరా అన్నారు. ఈ క్రమంలో డైరెక్ట్ గా టీడీపీ తరఫున ఏపీ బరిలోకి దిగేందుకు ఛాన్స్ లేకపోగా... తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్ ఎస్... చంద్రబాబును విమర్శిస్తున్న తీరును ఆధారం చేసుకుని వీహెచ్... బాబుకు అండగా నిలిచారు.
అయినా బాబుకు మద్దతుగా వీహెచ్ ఏమన్నారన్న విషయానికి వస్తే.. తెలంగాణ ఉద్యమ ద్రోహి అయిన జగన్ ను నెత్తినపెట్టుకుంటున్న కేసీఆర్... ఉద్యమానికి మద్దతిచ్చిన చంద్రబాబును వ్యతిరేకించడం ఏంటి? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన చంద్రబాబును కాదని, జగన్ కు కేసీఆర్ ఎందుకు మద్దతుగా నిలుస్తున్నాడని వీహెచ్ నిలదీశారు. తెలంగాణ ఉద్యమానికి ఏం చేశాడని టీఆర్ ఎస్ పార్టీ జగన్ కు వంతపాడుతోందని కూడా వీహెచ్ తనదైన శైలి ప్రశ్నలు సంధించారు. అయినా ఈ తరహా వైఖరి కేసీఆర్ కు కొత్తేమీ కాదని పేర్కొన్న వీహెచ్... తెలంగాణ ఉద్యమకారుడైన హరీశ్ రావునే పక్కనపెట్టారని ఆరోపించారు. మొత్తంగా వీహెచ్ తరఫున తెలంగాణలో చంద్రబాబుకు గట్టి అండే దొరికిందన్న సెటైరిక్ వాదన ఇప్పుడు బలంగానే వినిపిస్తోంది.