Begin typing your search above and press return to search.
ఈ బిగ్ బాస్ ఏందీబై నాగార్జున.. వీహెచ్ ఫైర్
By: Tupaki Desk | 22 July 2019 11:25 AM GMTఅప్పట్లో అర్జున్ రెడ్డి సినిమా విడుదల సందర్భంగా హీరో విజయ్, హీరోయిన్ ముద్దులు పెట్టుకున్న పోస్టర్లు హైదరాబాద్ లో అతికించడంపై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీ హనుమంతరావు చేసిన రచ్చ అంతా ఇంతాకాదు.. ఆయన వల్ల అర్జున్ రెడ్డి సినిమాకు కాసింత ప్రచారం అయితే వచ్చింది.. అది వేరే విషయం అనుకోండి.. తాజాగా వీహెచ్ మరోసారి మండిపడ్డారు. ఈసారి మాత్రం బుల్లితెర టాప్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’. దాని హోస్ట్ నాగార్జున పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతర సందర్భంగా మీడియాతో మాట్లాడిన వీహెచ్ బిగ్ బాస్ షోపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ సంప్రదాయ బోనాలు ఇక్కడ జరుగుతుంటే ఇదే హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో మహిళలను కించపరిచేలా బిగ్ బాస్ నడుపుతున్నారని ధ్వజమెత్తారు. డబ్బుల కోసం ఇలా బిగ్ బాస్ కొనసాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
మంచి మంచి సినిమాలు తీసి అగ్రహీరోగా ఎదిగిన నాగార్జున ఈ కార్యక్రమానికి హోస్ట్ చేయడం ఏంటని వీహెచ్ మండిపడ్డారు. అన్నమయ్య, భక్తరామదాసు వంటి సినిమాలు తీసిన నాగార్జునకు ఎందకయ్యా ఇలాంటి షో అని వీహెచ్ నిలదీశారు. మహిళలను కించపరిచే ఈ షో పనికిమాలిన షో అని.. పోలీసోళ్లు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. డబ్బుల కోసం బిగ్ బాస్ టీం సంప్రదాయాలను గౌరవించరా అని ప్రశ్నించారు. డబ్బుల పేరిట బిగ్ బాస్ లో మహిళలను ఆడిస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ సంప్రదాయానికి బిగ్ బాస్ కల్చర్ సరిపోదని.. కేసీఆర్, ఆయన కొడుకు ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదని వీహెచ్ మండిపడ్డారు. ఇలాంటి షోలతో డబ్బు సంపదించడం నాగార్జునకు తగదన్నారు. పోలీసోల్లు, హైకోర్టు ఈ షోను ఆపాలని డిమాండ్ చేశారు.