Begin typing your search above and press return to search.
అప్పులు తెచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారంట!
By: Tupaki Desk | 8 Sep 2016 4:21 AM GMTగతకొన్ని రోజులుగా తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు ఫుల్ హాట్ హాట్ గా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏమి చేసినా నడుస్తుంది.. అనే విమర్శ గత రెండు సంవత్సరాలుగా వినిపిస్తున్న తరుణంలో.. తాజాగా తెలంగాణలో ప్రతిపక్షం ఉందని నిరూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తం కుమార్ రెడ్డి - డీకే అరుణ - పొన్నాల లక్ష్మయ్య వంటివారు ప్రభుత్వంపై ఫైర్ అవగా.. తాజాగా ఏఐసిసీ కార్యదర్శి వి. హనుమంతరావు కేసీఆర్ అండ్ కో పై నిప్పులు చెరిగారు.
కేంద్రప్రభుత్వం నుంచి నిధులు సాధించడం ఎలాగో చేతకాక, దొరికిన చోటల్లా అప్పులుతెచ్చి, అదేదో పెద్ద గొప్పవిషయమన్నట్లు చెప్పుకుంటూన్నారని మొదలుపెట్టిన వి. హనుమంతరావు.. ముఖ్యమంత్రి కేసీఆర్ - మంత్రి హరీష్ రావు లు చేస్తున్న పనులు సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కేంద్రప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంటే సీఎం కేసీఆర్ - మంత్రి హరీష్ రావు తెలంగాణకు ఎందుకు సాధించలేకపోతున్నారని ఆయన అడుగుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలపై అప్పుల భారాన్ని మోపుతున్నామనే సోయి కేసీఆర్ - హరీష్ లకు లేకపోవడం బాదాకరమని, నాబార్డు నుంచి 7వేల కోట్లు అప్పు తెచ్చామని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని వీహెచ్ విమర్శించారు. ఇదే సమయంలో మోడీపైన కూడా వీహెచ్ ఫైరయ్యారు. కార్పొరేట్లకు 50వేల కోట్లు మాఫీ చేసి, రైతులను మాత్రం పట్టించుకోకపోవడంతో మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని తెలిసిపోయిందని ఆయన మండిపడ్డారు.