Begin typing your search above and press return to search.
ప్రజలు తిరగబడి తన్నే రోజు వస్తుందన్న వీహెచ్!
By: Tupaki Desk | 8 Jun 2019 8:00 PM ISTఘాటుగా రియాక్ట్ కావటంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కున్న టాలెంట్ మిగిలిన కాంగ్రెస్ నేతల్లో కాస్త తక్కువనే చెప్పాలి. ప్రజాదరణ విషయంలో వెనుకబడినా.. మసాలా దట్టించేలా మాట్లాడటంలో ఆయన తర్వాతే. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన డజను మంది ఎమ్మెల్యేల్ని టీఆర్ఎస్ లోకి లాగేసుకున్న నేపథ్యంలో టీ కాంగ్రెస్ పెద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. వీరందరి మాటలు ఒక ఎత్తు అయితే.. సీనియర్ నేత వీహెచ్ వ్యాఖ్యలు మరో ఎత్తుగా చెప్పాలి. పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేశామని.. గవర్నర్ ను కలిసినా సరైన స్పందన ఉండటం లేదన్న ఆయన.. కోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా.. ఎమ్మెల్యేలను విలీనం చేసుకోవటం ఏమిటని ప్రశ్నించారు.
తెలంగాణలో ప్రతిపక్షం ఉండకూడదని కేసీఆర్ కోరుకుంటున్నట్లుగా మండిపడ్డ వీహెచ్.. ప్రజాస్వామ్యానికే వెన్నుపోటు పొడిచారన్నారు. ప్రతిపక్షాన్ని చూసి భయపడుతున్న కేసీఆర్.. ఫిర్యాదు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవటం ద్వారా ఓటర్లను మోసం చేస్తున్నారన్నారు.
కేసీఆర్ చేస్తున్న రాజకీయాలకు తెలంగాణ ప్రజలు తిరగబడి తన్నే రోజు వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా దళితుడ్ని చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి.. దళిత ప్రతిపక్ష నేతను కూడా లేకుండా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సోనియాను సైతం కేసీఆర్ మోసం చేశారని చెప్పిన వీహెచ్ వ్యాఖ్యల్ని చూస్తే.. దళిత ప్రతిపక్ష నేత విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యల్లో అర్థం ఉందని చెప్పక తప్పదు. అలాంటి లాజిక్కులు బయటకు తీస్తున్న వీహెచ్.. సారుకొచ్చే కోపం గురించి ఆలోచించట్లేదే!