Begin typing your search above and press return to search.

మోడీ గురించి మొద‌లెట్టాడు

By:  Tupaki Desk   |   3 Sept 2017 6:12 PM IST
మోడీ గురించి మొద‌లెట్టాడు
X
కూట్ల రాయి తీయ‌లేనోడు ఏట్ల రాయి తీయ వొయ్యిండ‌ని సామెత‌. సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌ - రాజ్య‌స‌భ స‌భ్యుడు వి.హ‌నుమంత‌రావు వ్య‌వ‌హారాలు అన్నీ ఇలానే ఉంటాయి. ఎంతో అనుభ‌వం ఉన్న నేత‌ను అని చెప్పుకునే వీహెచ్ ను కాంగ్రెస్ పార్టీలో ఎవ‌రూ సీరియ‌స్ గా ప‌ట్టించుకోరు. వారిది నియంతృత్వం .. వీరిది బానిస‌త్వం అని దీర్ఘాలు తీసే వీహెచ్ తాను మాత్రం గాంధీ కుటుంబ సేవ‌కున్ని అంటూ ఎప్పుడూ సోనియా గాంధీ కుటుంబ జ‌పం చేస్తూ ఆ దయ‌తోనే ప‌ద‌వులు పొందాల‌ని చూస్తాడు.

మొన్న‌టికి మొన్న 2014 ఎన్నిక‌ల్లో సొంత నియోజ‌క‌వ‌ర్గం అంబ‌ర్ పేట నుండి పోటీ చేస్తే పోల‌యిన 1,46,189 ఓట్ల‌లో వ‌చ్చింది 16975 ఓట్లు. అంటే కేవ‌లం 11.66% ఓట్లు. ఇన్నేండ్లు రాజ‌కీయాల్లో ఉంటూ ప్ర‌జ‌ల్లో ఆయ‌న ప‌లుకుబ‌డికి నిద‌ర్శ‌నం ఇది. ప్ర‌జాబ‌లం లేకుండా కేవ‌లం మీడియా బ‌లంతో - అధిష్టానానికి న‌మ్మ‌కం క‌ల‌వార‌మ‌న్న ముద్ర‌తో ప‌ద‌వులు సాధిస్తూ రాజ‌కీయం సాగిస్తున్న వీహెచ్ తాజాగా కేంద్ర మంత్రి ప‌ద‌వి కోల్పోయిన బండారు ద‌త్తాత్రేయకు మ‌ద్ద‌తు ప‌లికాడు.

కేంద్ర కేబినెట్ నుంచి బండారు దత్తాత్రేయను తొలగించడం అన్యాయమని, ప్రధాని నరేంద్ర మోదీ బీసీ వ్యతిరేకిగా మారారని, బీసీలంతా ఏకమై వచ్చే ఎన్నికల్లో బీజేపీకి బుద్ధిచెప్పాలంటూ వీహెచ్ పిలుపునిచ్చాడు. సొంత పార్టీ కాంగ్రెస్ లో ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దలేని వీహెచ్ బీజేపీలో నిర్ణ‌యాల‌ను ప్ర‌శ్నించ‌డం విడ్డూరంగా ఉంది. ప్ర‌ధాని బీసీ అని చెప్పుకుంటారు త‌ప్పితే బీసీల‌కు న్యాయం చేయ‌ర‌ని వీహెచ్ అన్నాడు. మ‌రి కాంగ్రెస్ లో పొన్నాల ల‌క్ష్మ‌య్య‌ను పీసీసీ అద్య‌క్ష్య ప‌ద‌వి నుండి త‌ప్పించి ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి ఇచ్చిన‌ప్పుడు ఈయ‌న చేశారో సెల‌విస్తే బాగుంటుంది.