Begin typing your search above and press return to search.
వెంకయ్యపై వాళ్లకూ స్పష్టత వచ్చింది
By: Tupaki Desk | 20 Sep 2015 6:03 AM GMTఒక్కోసారి పెద్దరికం కూడా చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. రాజకీయాల్లో అయితే ఇది తరచుగా జరిగేదే. సదరు నాయకుడు ఏమైనా చేయగలడు అనే నమ్మకం ఉండటం, దానికి తోడు ఆ నేతాశ్రీకూడా అలాగే వ్యవహరించడంతో సమస్య వచ్చిపడుతుంది. ఇపుడు సరిగ్గా ఇలాంటి సమస్యే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు ఎదురైంది.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆ రాష్ర్ట ప్రజలంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ డిమాండ్ తో పార్టీలకు అతీతంగా నాయకులు తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా రోడ్డెక్కుతున్న ఆంధ్రా నాయకులకు ఇపుడు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు జోడయ్యారు. కొద్దికాలం క్రితం ప్రత్యేక హోదా కోసం మద్దతు ఇచ్చిన వీహెచ్ ఇపుడు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును ప్రత్యేక హోదా పంచాయతీలో ఇరికించారు. ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హోదాపై అక్కడో కథా.. ఇక్కడో కథా చెబుతున్నారని దుయ్యబట్టారు.
అందుకే వెంకయ్యనాయుడును ఏపీ ప్రజలు అడ్డుకోవాలని వీహెచ్ పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేదాక విజయవాడ - నెల్లూరు తదితర ప్రాంతాల్లో వెంకయ్యను కాలు పెట్టనివ్వొద్దని ప్రజలకు ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో అందరికంటే ఎక్కువగా వెంకయ్య నాయుడు మొసలికన్నీరు కార్చారని వీహెచ్ విమర్శించారు. ‘బిల్లు పాసయ్యే క్రమంలో మాకంటే ఎక్కువ అడ్డం పడిన వెంకయ్యనాయుడు ఇప్పుడు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. పదేళ్లు హోదా కావాలని అడిగి, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో చెప్పించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ తెగువ ఏమైందని అని ప్రశ్నించారు. వెంకయ్యనాయుడుతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా నాటకాలు ఆడుతున్నారని వీహెచ్ విమర్శించారు. వారిద్దరూ కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోడీని గట్టిగా అడిగితే హోదా ఇవ్వరా? కేవలం వారు ప్రజలను మోసం చేస్తున్నారు అంటూ ధ్వజమెత్తారు. పొరుగు రాష్ర్టం వారికి కూడా ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య పాత్రపై స్పష్టత రావడం ఆసక్తికరమే.