Begin typing your search above and press return to search.

హనుమంతన్నది ఏపీనా? తెలంగాణనా?

By:  Tupaki Desk   |   2 July 2016 8:04 AM GMT
హనుమంతన్నది ఏపీనా? తెలంగాణనా?
X
గతంలో ఇలాంటి ప్రశ్నలు వేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఎవరికి ఏ అంశం మీద ఆసక్తి ఉంటే.. ఆ ఇష్యూ మీద మాట్లాడేవారు. కానీ.. ఇప్పుడు సీన్ మారిపోయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ ప్రాంతానికి చెందిన నేతలు ఏపీ ఇష్యూల మీద.. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు తెలంగాణ అంశాల మీద మాట్లాడటం మామూలైంది. ఎవరూ కూడా తమ రాష్ట్రానికి సంబంధం లేని అంశాల్ని టచ్ చేయని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. దీనికి భిన్నమైన పరిస్థితి తెలంగాణకాంగ్రెస్ నేత వీహెచ్ హనుమంతరావు విషయంలో కనిపిస్తోంది. ఈ మధ్యన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇష్యూలో వేలెట్టి మాట్లాడిన ఆయన.. తరచూ ఏపీ అంశాల మీద మాట్లాడటం.. ఏపీ ముఖ్యమంత్రిని విమర్శించటం చేస్తున్నారు. తాజాగా అయితే.. ఆయన ఏకంగా నిరసన ప్రదర్శనే చేపట్టటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తనతో పాటు.. తెలంగాణకు చెందిన మరికొందరు నేతలతో కలిసి హైదరాబాద్ లో ఆయన చేసిన నిరసన పలువురిని ఆకర్షించింది. ఇంతకీ హనుమంతన్నకు నిరసన చేసేంత ఇష్యూ ఏమిటన్నది చూస్తే.. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాల పేరిట బెజవాడలో దాదాపు 30 గుళ్లను కూలగొట్టటం ఇప్పుడక్కడ తీవ్రనిరసన వ్యక్తమవుతోంది. ఈ ఇష్యూలో ఏపీ సర్కారు తీరును తప్పు పడుతూ.. హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం ఎదుట నోటికి బ్లాక్ రిబ్బన్ ను కట్టుకొని మౌనదీక్ష చేపట్టటం గమనార్హం. అయినా తెలంగాణలో సమస్యలు లేవన్నట్లుగా ఇక్కడి ఇష్యూలను వదిలేసి.. ఏపీలో జరుగుతున్న ఇష్యూల మీద హనుమంతన్న రియాక్ట్ కావటం గమనార్హం. వీహెచ్ లో కనిపిస్తున్న ఈ మాత్రం ఉత్సాహం కూడా ఏపీ కాంగ్రెస్ నేతల్లో కనిపించటం లేదే..?