Begin typing your search above and press return to search.
పొద్దుపొద్దున్నే పోలీసులకు షాకిచ్చిన వీహెచ్!
By: Tupaki Desk | 18 Jun 2019 4:41 AM GMTఈ రోజు ఉదయం పంజాగుట్ట పోలీసులకు చెమటలు పట్టించి.. పరుగులు పెట్టించేలా వ్యవహరించారు ఇద్దరు మాజీ ఎంపీలు. కొద్ది వారాల క్రితం పంజాగుట్ట చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయటం.. అనుమతి లేని అంబేడ్కర్ విగ్రహాన్ని జీహెచ్ ఎంసీ సిబ్బంది తొలగించటం తెలిసిందే.
తొలగింపు వ్యవహారంలో అధికారులు ప్రదర్శించిన నిర్లక్ష్యం పెద్ద వివాదంగా మారటం.. వరుస ఆందోళనలు.. నిరసనలకు కారణమైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ రోజు (మంగళవారం) ఉదయం పంజాగుట్ట చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేసి విఫలయ్యారు వీహెచ్.. హర్షకుమార్ లు ఇద్దరూ.
మంగళవారం ఉదయం అంబేడ్కర్ విగ్రహాన్ని లారీలో తీసుకొచ్చి.. అక్కడ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. వీహెచ్.. హర్ష కుమార్ లతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు.. వివిధ సంఘాల వారు అక్కడున్నారు. దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకున్న పంజాగుట్ట పోలీసులు ఉరుకులు పరుగుల మీద ఘటనాస్థలానికి వెళ్లి.. అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టకుండా నిరోధించారు.
అనంతరం నేతల్ని అరెస్ట్ చేయటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంబేడ్కర్ విగ్రహంతో పాటు లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు..అక్కడి వారందరిని అరెస్ట్ చేసి బొల్లారం తరలించారు. మొత్తమ్మీదా పొద్దు పొద్దున్నే వీహెచ్.. హర్షకుమార్ లు ఇద్దరు కలిసి విగ్రహ ఏర్పాటు కోసం చేసిన ప్రయత్నం పోలీసులకు షాకింగ్ గా మారిందని చెప్పక తప్పదు.