Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి నువ్వొక్కడివే మగాడు కాదు.. వీహెచ్

By:  Tupaki Desk   |   20 March 2020 8:30 AM GMT
రేవంత్ రెడ్డి నువ్వొక్కడివే మగాడు కాదు.. వీహెచ్
X
కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వైఖరిని మొదటి నుంచి సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు వ్యతిరేకిస్తున్నాడు. రేవంత్ రెడ్డి పార్టీలో చేరికను వ్యతిరేకించిన ఆయన అనంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి నియామకం కావడంతో వీహెచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి వ్యవహారంపై మరోసారి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా రేవంత్ రెడ్డి పార్టీ నాయకత్వంపై చేసిన విమర్శలను వీహెచ్ తిప్పికొట్టారు. తాను జైల్లో ఉంటే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ పరామర్శించలేదని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై వీహెచ్ స్పందించారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డే ఏమన్నా ఖాళీ ఉన్నాడా? ఆయన పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నాడు.. వచ్చి పరామర్శించాలంటే ఎలా? అని ప్రశ్నించారు. తానుక్కడినే కాంగ్రెస్ లో పోరాడుతున్నానని రేవంత్ రెడ్డి చెప్పుకోవడం సరికాదన్నారు. తాను కేసీఆర్ తో కొట్లాడామని - నువ్వు కేసీఆర్ తో కాదు బాబు తాము ఎన్టీఆర్ - చంద్రబాబుపై పోరాడమని తెలిపారు. మీరందరూ కాదు తానొక్కడినే కేసీఆర్ తో కొట్లాడుతున్నానని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికావని తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై వెంటనే పార్టీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించి.. కేసీఆర్ ప్రభుత్వంపై ఎలా కొట్లాడదామనే విషయంపై చర్చిద్దామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు.

కార్యకర్తల స్థాయి నుంచి తమలాంటి వారు ఎందరో కాంగ్రెస్‌లో పోరాడుతూనే ఉన్నారని పేర్కొన్నారు. తమపై సోషల్‌ మీడియాలో రేవంత్‌ వర్గం తప్పుడు ప్రచారం చేస్తున్నదని - అందుకే త్వరగా పార్టీ మీటింగ్‌ పెట్టాలని పీసీసీ చీఫ్‌ ను కోరుతున్నట్లు వీహెచ్‌ తెలిపారు. కేసీఆర్‌ తోని తాను ఒక్కడినే కొట్లాడుతున్నట్టు రేవంత్‌ బిల్డప్‌ ఇవ్వడం సరికాదని.. అందరూ పోరాడుతూనే ఉన్నారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి వైఖరి సరికాదని ఈ సందర్భంగా ఖండించారు.