Begin typing your search above and press return to search.
గొర్రెలు-బర్రెలు..తర్వాత కేసీఆర్ ఏం చేయనున్నారో!
By: Tupaki Desk | 21 Sept 2017 9:00 PM ISTఇటీవలి కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా విరుచుకుపడుతున్న ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వీహనుమంతరావు మరోమారు తన దూకుడు ప్రదర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పాడి సంపద పంపిణీపై భారీ సెటైర్ వేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నాసిరకపు బతుకమ్మ చీరలు పంచి మహిళలను అవమానించారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తనయ, ఎంపీ కవిత కట్టిన చీరల క్వాలిటీ చీరలు అందరు మహిళలు కట్టినప్పుడే నిజమైన బతుకమ్మ అని తెలిపారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కనపెట్టి .. కొత్త కొత్త డ్రామాలు తెరలేపుతున్నారని మండిపడ్డారు.
దళితులకు మూడెకరాల హామీ నుంచి తప్పించుకునేందుకు భూసర్వే ప్రతిపాదనను కేసీఆర్ తెరమీదకు తీసుకువచ్చారని వీహెచ్ ఆరోపించారు. దళితులకు మొండి చెయ్యి చూపించేందుకు కేసీఆర్ ఈ భూసర్వే పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. ఈ సర్వే చేసిన తరువాత సర్కార్ భూమి లేదని చెప్పడం ఖాయమని వీహెచ్ జోస్యం చెప్పారు. దళితులకు భూమి కొని ఇస్తానని చెప్పి కేసీఆర్ ఆ తరువాత మొండి చెయ్యి చూపడం ఖాయమని ఆరోపించారు. గొర్రెల పంపిణీ ఓ మోసమని వీమెచ్ మండిపడ్డారు. ``బీసీలకు గొర్రెలు .. బర్రెలు .. అయిపోయాయి .. ఇక గాడిదల పంపినే మిగిలింది`` అని ఎద్దేవా చేశారు. కొత్త సచివాలయం అవసరం లేదని రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు అభిప్రాయ పడుతున్నారని అయినప్పటికీ కేసీఆర్ మొండిగా ముందుకు సాగుతున్నారని వ్యాఖ్యానించారు.
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాళేశ్వరం సొరంగం పనుల్లో జరిగిన ప్రమాదానికి మంత్రి హరీష్ రావు నైతిక బాధ్యత వహించి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పనుల్లో సర్కార్ నిర్లక్ష్యమే నాణ్యత లోపానికి కారణమని తెలిపారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ పండుగకు చేనేత చీరెలు ఇస్తామని ప్రచారం చేసి పాలిస్టర్ చీరలు ఇచ్చారని పొన్నం పేర్కొన్నారు. చీరెల కొనుగోలు మీద విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పంట పొలాలకు పక్షులు రాకుండా కట్టడానికే బతుకమ్మ చీరెలు పనికొస్తాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు మద్యం మీదున్న శ్రద్ద పాల సేకరణ మీద లేదని పొన్నం మండిపడ్డారు. అన్ని డెయిరీల పాల ఉత్పత్తి దారులందరికీ ప్రోత్సాహకాలు ఇవ్వాలని పొన్నం డిమాండ్ చేశారు.