Begin typing your search above and press return to search.

రోజాకు తెలంగాణ లీడర్ సపోర్టు

By:  Tupaki Desk   |   12 Feb 2017 7:31 AM GMT
రోజాకు తెలంగాణ లీడర్ సపోర్టు
X
అమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంటు సదస్సుకు రావాలంటూ వచ్చిన ఆహ్వానం మేరకే అక్కడకు వెళ్లిన రోజాను చంద్రబాబు ప్రభుత్వం అవమానించడంపై అంతటా విమర్శలు వినిపిస్తున్నాయి. రోజా పట్ల ప్రభుత్వం అనుసరించిన తీరును కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తీవ్రంగా తప్పుపట్టారు. మహిళా సదస్సుకు మహిళా ఎమ్మెల్యే వెళ్లకుండా అడ్డుకోవడం ఎలాంటి సాధికారిత అవుతుందని ప్రశ్నించారు. పార్టీ మధ్య విబేధాలు ఉండవచ్చని.. కానీ వాటిని మనసులో పెట్టుకుని ఇలా ఒక మహిళా ఎమ్మెల్యేను బలవంతంగా నిర్బందించడం దుర్మార్గమన్నారు.

చంద్రబాబు తీరు చూస్తుంటే కేవలం మహిళల ఓట్ల కోసమే సదస్సు పెట్టినట్టుగా ఉందన్నారు. అసలు రోజాను ఎందుకు నిర్బంధించాల్సి వచ్చిందో ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. అమరావతి వెళ్లి మహిళా సాధికారితపై గొప్పగొప్ప స్పీచ్‌లు ఇస్తున్న ఎంపీ కవిత… ముందు తన తండ్రి కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడా ఎందుకు స్థానం కల్పించలేదో చెప్పాలన్నారు.

కాగా స్పీకర్ కోడెల బండారం తాను బయటపెట్టినందుకే ఇలా వేధించారని రోజా ఆరోపిస్తున్నారు. నీతులు చెబుతున్న కోడెల శివప్రసాద్‌ గురించి ప్రజలకు తెలియాలనే ఆయన కోడలి ఆర్తనాదాల వీడియోను సోషల్‌ మీడియాలో షేర్ చేశానని వైసీపీ ఎమ్మెల్యే రోజా చెప్పారు. అందుకే తనపై కక్ష కట్టి పోలీసులను ఉసిగొల్పారన్నారు. డీజీపీ వ్యాఖ్యలు విన్న తర్వాత పోలీస్ వ్యవస్థపై నమ్మకం పోయిందన్నారు రోజా. తనను చంపేందుకు కూడా వెనుకాడడం లేదన్నారు. స్పీకర్ గా తటస్థంగా ఉండాల్సిన కోడెల శివప్రసాద్‌రావు టీడీపీ శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారని ఇలాంటి స్పీకర్ ఎక్కడైనా ఉంటారా అని రోజా ప్రశ్నించారు. మహిళా సదస్సులో చంద్రబాబు కోడలితో ప్రసంగాలు చేయించిన కోడెల శివప్రసాద్‌రావు తన కోడలితో మాట్లాడించి ఉంటే అసలు విషయాలు తెలిసేవన్నారు.