Begin typing your search above and press return to search.
మరో 'అర్జున్ రెడ్డి' కేసీఆర్ తో రిపీటా.? వీహెచ్ రెడీ
By: Tupaki Desk | 8 Oct 2018 11:09 AM GMT‘అర్జున్ రెడ్డి’ సినిమా విడుదల సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు చేసిన హల్ చల్ అంతా ఇంతాకాదు.. ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ - హీరోయిన్ శాలినిలు లిప్ టు లిప్ కిస్ పెట్టుకున్న పోస్టర్లను వీహెచ్ చింపివేస్తున్న ఫొటోలు అప్పట్లో వైరల్ గా మారాయి. సేమ్ ఇప్పుడు అదే అర్జున్ రెడ్డిని వీహెచ్ పునరావృతం చేశారు. ఆర్టీసీ బస్సులపై కేసీఆర్ ప్రచార ఫొటోలను వీహెచ్ చింపుతూ మీడియా కంట పడ్డాడు. దీంతో అర్జున్ రెడ్డిని మరోసారి పునరావృతం చేశాడు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికల దృష్ట్యా ఇటీవలే కాంగ్రెస్ అధిష్టానం పలు కమిటీలను వేసింది. ఇందులో ‘వ్యూహ, ప్రణాళిక కమిటీ చైర్మన్ ’గా వీ హనుమంతరావు బాధ్యతలు చేపట్టారు. దీంతో ఎన్నికల్లో టీఆర్ ఎస్ అధికార దుర్వినియోగంపై ఆయన ప్రధానంగా ఫోకస్ పెట్టారు.
తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనావళిని ఈసీ ప్రవేశపెట్టిన దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగం ఏ రాజకీయ వ్యక్తిని - రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేయడానికి వీలులేదు. కానీ తెలంగాణ ఆర్టీసీ బస్సులపైన కేసీఆర్ పథకాలు, ఆయన ఫొటోలు ఉండడంపై వీహెచ్ ఆగ్రహించారు. స్వయంగా బస్సుల వద్దకు వెళ్లి ఆ ఫొటోలను చింపేశారు. నాలుగున్నర సంవత్సరాలుగా కేసీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశాడని వీహెచ్ విమర్శించారు. ఎన్నికల తేదీలు ప్రకటించాక కూడా కేసీఆర్ అధికార దుర్వినియోగం చేస్తూ హైదరాబాద్ లో ప్రభుత్వ ఆస్తుల మీద టీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు.
అర్జున్ రెడ్డి సినిమా విడుదలైనప్పుడు కూడా వీహెచ్ ఇలానే విజయ్ దేవరకొండ పోస్టర్లు చింపి పాపులర్ అయ్యాడు. సినిమా పోస్టర్ ను చింపితే ఏమొస్తుందని వీహెచ్ ను మీడియా ప్రశ్నించినా ఆయన సరైన సమర్ధన చేసుకోలేదు. వీహెచ్ చింపిన మహత్య్మమో లేక మరేదో కానీ ఆ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది.
విజయ్ దేవరకొండ పోస్టర్ చింపితే అతడిప్పుడు స్టార్ హీరో అయిపోయాడు.. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో కేసీఆర్ పోస్టర్లను వీహెచ్ చింపాడని.. టీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం ఖాయమని టీఆర్ఎస్ అభిమానులు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా వీహెచ్ చేసిన ఈ పనితో మరోసారి చరిత్ర పునరావృతమవుతుందని.. టీఆర్ ఎస్ కే మేలు జరుగుతుందని కామెంట్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి-కేసీఆర్ చిత్రాలను వీహెచ్ చింపే చిత్రాలను పోలుస్తూ నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. ఇలా వీహెచ్ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.