Begin typing your search above and press return to search.
మిగిలిన తమ్ముళ్ల మీద పడిన వీహెచ్
By: Tupaki Desk | 22 Feb 2016 4:29 AM GMTఓపక్క తెలంగాణ అధికారపక్షం పుణ్యమా అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కిందామీదా పడిపోతుంటే.. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. రాజ్యసభ సభ్యుడు వీహెచ్ హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ ఎస్ ను ఓడించాలన్న పట్టుదల ఉంటే తెలంగాణ టీడీపీ తమ్ముళ్లంతా సైకిల్ దిగేసి అభయహస్తం దరికి చేరాలని పిలుపునిస్తున్నారు. 2019 నాటి ఎన్నికల్లో పోటీ అంతా టీఆర్ఎస్.. కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉంటుందని.. అందుకే.. మిగిలిపోయిన తమ్ముళ్లంతా కాంగ్రెస్ లోకి రావాలని ఆయన సూచిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఇస్తే చాలు.. తెలంగాణను ఏలేస్తాం.. అధికారం తమదేనని ఢంకా బజాయించి చెప్పుకున్న వీహెచ్ లాంటి కాంగ్రెస్ నేతలకు.. ఇప్పుడు తమ్ముళ్ల అవసరం వచ్చిందా? మిగిలిపోయిన తమ్ముళ్ల కోసం వీహెచ్ పడుతున్న ఆరాటం చూస్తుంటే.. తమ్ముళ్ల సంగతేమో కానీ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దిగజారిందన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు. అయిన.. అధికారపార్టీలోకి వెళ్లకుండా మిగిలిపోయిన తమ్ముళ్ల మీద వీహెచ్ కి మరీ అంత ఆశేమిటో..? తెలంగాణ అధికారపక్షం వదిలేసిన తమ్ముళ్లతో వర్క్ వుట్ అవుతుందన్న అంత ఆశేంటి వీహెచ్..?