Begin typing your search above and press return to search.
రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ .. ఒక్కరోజే కోటి డోసులు !
By: Tupaki Desk | 28 Aug 2021 7:30 AM GMTకరోనా మహమ్మారి విజృంభణను అడ్డుకోవడానికి మన దగ్గరున్న ఏకైక మార్గం వ్యాక్సిన్ తీసుకోవడమే. అందుకే వ్యాక్సినేషన్ ప్రక్రియను దేశవ్యాప్తంగా శరవేగంగా ముందుకి తీసుకుపోతున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన మొదట్లో కొందరు వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడ్డారు. కానీ, ఆ తర్వాత అందరూ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకి వస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే ఇమ్మ్యూనిటీ పవర్ పెరుగుతుందని ప్రచారం చేయడం, మరో వేవ్ కూడా వచ్చే ప్రమాదం ఉందని చెప్పడం తో వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా దేశంలో ఓ రేర్ రికార్డ్ నమోదు అయ్యింది. శుక్రవారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా కోటికి పైగా వ్యాక్సిన్లు వేసింది. రాత్రి 10 గంటలలోపు ఒక్క రోజులో వేసిన డోసుల సంఖ్య 1,00,64,032కి చేరింది. ఒక్క రోజులో ఎక్కువ వ్యాక్సిన్లు వేసిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ టాప్ కి చేరింది. ఈ కారణంగా ఆగస్టులో ఇప్పటివరకూ 15 కోట్లకు పైగా వ్యాక్సిన్లు వేసినట్లైంది. ఒకే నెలలో ఇన్ని వ్యాక్సిన్లను ఇండియా ఎప్పుడూ వెయ్యలేదు. జులైలో రికార్డు 13.45 కోట్ల డోసులుగా ఉంది. జూన్ లో 11.97 కోట్ల డోసులు వేశారు. తాజా రికార్డుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. యూపీ ప్రభుత్వం, కరోనా వారియర్లకు విషెస్ చెప్పారు. దీంతో మొత్తం వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య 62,17,06,882కు చేరుకుంది
భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ ద్వారా.. దేశ జనాభాలో 37శాతం మందికి కనీసం ఒక డోసు వ్యాక్సినేషన్ పూర్తయినట్టుగా తెలుస్తోంది. అదే రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిన వారి శాతం సుమారు పది శాతంగా ఉంది. రెండో డోసు వేయించుకోవాల్సిన గడువు దాటిపోయినా కొందరు వ్యాక్సిన్ వేయించుకోలేదని కూడా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు వ్యాక్సిన్ వేయించుకున్న పౌరులకు అభినందనలు తెలుపుతూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. ఈ నెల 17న ఒకే రోజు 88 లక్షల డోసుల వ్యాక్సినేషన్లు జరిగాయి. ఇప్పటి వరకూ ఒకరోజులో జరిగిన అత్యధిక వ్యాక్సినేషన్ల రికార్డు అదే కాగా, తాజా రికార్డు దాన్ని బద్దలుకొట్టింది. 18–44 వయసుల వారిలో 30,85,06,160 మంది మొదటి డోసు వ్యాక్సినేషన్ తీసుకోగా, 23,98,99,849 మంది రెండు డోసులను తీసుకున్నారు.
దేశంలో మళ్లీ రెండు నెలల తర్వాత ఒకేరోజు అత్యధిక కరోనా కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 46, 759 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క కేరళలోనే 32,801 కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,26,49,947కు చేరింది. ఇక శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 509 మంది మరణించగా.. మొత్తం మీద 4,37,370 మంది కరోనా కారణంగా మరణించారు. 24 గంటల్లో కొత్తగా 31, 374 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,18,52,802గా ఉంది. ఇక దేశంలో 3,59,775 యాక్టివ్ కేసులు ఉన్నాయి.