Begin typing your search above and press return to search.
విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సినేషన్
By: Tupaki Desk | 6 Jun 2021 12:30 PM GMTఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి కోవిడ్ వ్యాక్సినేషన్ అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు సంగతి తెలిసిందే. దీంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ లోని నారాయణ గూడలో గల ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రీవెంటీన్ మెడిసిన్ (ఐపీఎం) లో వ్యాక్సినేషన్ ను అధికారులు ప్రారంభించారు.
ముందుగా బుక్ చేసుకున్న 300 మంది విద్యార్థులకు ఈ వ్యాక్సిన్ ఇచ్చినట్టు శంకర్ తెలిపారు. రెండురోజుల్లో మొత్తం 7వేల మంది వ్యాక్సిన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వ్యాక్సినేషన్ కేంద్రం తెరిచి ఉంటుందని.. విద్యార్థులు తమ టైమ్ స్లాట్ ప్రకారం వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని అధికారులు సూచించారు.
అసలైన పాస్ పోర్టు, వీసా, విదేశీ విశ్వవిద్యాలయ ప్రవేశ నిర్ధారణ పత్రం, ఆధార్ కార్డ్ వెంట తీసుకొని రావాలని..ఆన్ లైన్ బుకింగ్ లో నమోదు చేసిన వివరాలతో పత్రాలను సరిచేసుకున్న తర్వాతనే వ్యాక్సిన్ వేస్తామని స్పష్టం చేశారు.
ఇక రెండు, మూడు నెలల్లో విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. డోసు వేసుకున్న వారికి అధికారికంగా సర్టిఫికెట్ ఇస్తామని.. దాంతో విద్యార్థులు విదేశాలకు వెళ్లవచ్చని సూచించారు.
ప్రస్తుతం కోవీషీల్డ్ మాత్రమే వేస్తున్నామని.. కోవాగ్జిన్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే విద్యార్థుల ఇష్టాన్ని బట్టి రెండింటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. రోజుకు 700 మందికి టీకాలు వేస్తామని తెలిపారు.