Begin typing your search above and press return to search.
పోలాండ్ లో కోవిడ్ టీకాల వ్యాక్సినేషన్ ప్రారంభం
By: Tupaki Desk | 27 Dec 2020 2:00 PM GMTప్రపంచం నెమ్మదిగా పౌరులకు టీకాలు వేసే ప్రక్రియను ప్రారంభిస్తోంది. పోలాండ్ దేశం అమెరికా తర్వాత ఈ జాబితాలో చేరింది. అమెరికా తయారు చేసిన ‘ఫైజర్’ వ్యాక్సిన్ ఇప్పటికే రెడీ అయ్యి అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. తాజాగా పోలండ్ కు కూడా ఈ టీకాలు చేరాయి. కరోనా వ్యాక్సిన్లు దేశంలోని ఆసుపత్రులకు చేరుకున్నాయి.దీంతో ‘ఫైజర్’ వ్యాక్సిన్లను మొదట ఫ్రంట్‌లైన్ కార్మికులకు ఇస్తున్నారు. కరోనా టీకాలను పోలండ్ దేశంలో మొదట ఒక హెడ్ నర్సుకు ఇచ్చి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. దేశంలోనే టీకా తీసుకున్న మొదటి వ్యక్తిగా వార్సాలోని పరిపాలన మంత్రిత్వ శాఖ సెంట్రల్ క్లినికల్ హాస్పిటల్ లో పనిచేసే హెడ్ నర్సు పేరు పొందింది..
టీకా వేసుకున్న నర్సు అలిజా జాకుబోవ్స్కా మాట్లాడుతూ "నేను దేశంలోనే తొలి టీకా తీసుకున్నందుకు గర్వపడుతున్నాను. ఆదివారం ఫైజర్-బయోఎంటెక్ టీకా తీసుకున్న తరువాత ప్రజలందరికీ ఇది సుక్షితమని చెప్పదలుచుకున్నా.. ఈ టీకా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ చూపించలేదన తెలిపింది.
జాకుబోవ్స్కా తరువాత, ఇతర వైద్యులు మరియు నర్సులు కూడా కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నారు. యూరోపియన్ యూనియన్ అంతటా ఫైజర్ టీకా తీసుకున్న మొదటి దేశంగా పోలండ్ నిలించింది. వ్యాక్సిన్ల మొదటి రవాణా ఈ దేశానికే జరిగింది. ఇక ఈ టీకా కార్యక్రమం జనవరిలో దేశంలోని ప్రజలందరికీ ప్రారంభమవుతుంది. ప్రస్తుతానికి, ఆరోగ్య సంరక్షణ కార్మికులు మాత్రమే వ్యాక్సిన్లను పొందుతున్నారు, అయితే సీనియర్ సిటిజన్లు, ఉపాధ్యాయులు, పోలీసు అధికారులు మరియు ఇతర వర్గాలకు జనవరి నుంచి పంపిణీ చేస్తారు.
పోలండ్ దేశంలోని వార్సాలో గల సెంట్రల్ క్లినికల్ హాస్పిటల్‌కు ఆదివారం 75 సీసాల టీకాలు వచ్చాయి. దీనివల్ల 375 మందికి టీకాలు వేయవచ్చు. ప్రతి సీసాను ఐదుగురికి ఇవ్వడానికి ఉపయోగపడుతుందని కేంద్ర అంతర్గత మరియు పరిపాలన మంత్రిత్వ శాఖ ప్రతినిధి పిఎపి ఇవోనా సోల్టిస్ తెలిపారు.