Begin typing your search above and press return to search.

టీకా వేయించుకోవాల్సిందే .. వేరే మార్గం లేదు.. ప్రముఖ వైద్యుడు నాగేశ్వర్​ రెడ్డి

By:  Tupaki Desk   |   24 May 2021 2:30 AM GMT
టీకా వేయించుకోవాల్సిందే .. వేరే మార్గం లేదు.. ప్రముఖ వైద్యుడు నాగేశ్వర్​ రెడ్డి
X
‘కరోనాను అదుపులోకి తీసుకురావడానికి టీకా ఒక్కటే మార్గం. అంతకు మించి వేరే మార్గం ఏదీ లేదు. టీకాల విషయంలో మన ప్రభుత్వాలు ఎంతో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాయి. ఇది అవమానకరం. ప్రస్తుతం ముప్పు పొంచి ఉంది. టీకా వేసుకోవడం మినహా వేరే మార్గం లేదు. ఇతర దేశాల నుంచి తెప్పించుకుంటారా? లేక మనదేశంలో ఉత్పత్తిని పెంచుతారా? అన్నది వేరే విషయం . కానీ కచ్చితంగా వ్యాక్సినేషన్​ పెంచాలి. అప్పటివరకు అందరూ జాగ్రత్తగా ఉండాలి.

ప్రస్తుతం తెలంగాణలో ఉధృతి తగ్గినట్టుగా కనిపిస్తుంది. జూన్​ వరకు పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది’ అని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్​, ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్‌ డాక్టర్‌ డీ నాగేశ్వర్‌ రెడ్డి పేర్కొన్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన పలు సూచనలు చేశారు.
‘మొదట కేసుల సంఖ్య తక్కువవుతుంది. ఆ తర్వాత మరణాల సంఖ్య తగ్గుతుంది. ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య కూడా తగ్గుతుంది. అప్పుడే కరోనా అదుపులోకి వస్తుంది.

ప్రస్తుతం చాలా మంది కరోనా వ్యాధి గ్రస్థులకు ఆక్సిజన్​ లెవెల్స్​ తగ్గుతున్నాయి.

ఆక్సిజన్​ లెవెల్స్​ 80 ఉన్నప్పుడే వాళ్లు ఆస్పత్రికి వస్తే లాభం ఉంటుంది. అంతేకానీ .. ఆక్సిజన్​ లెవెల్స్​ 70 శాతానికి పడిపోయాక ఆస్పత్రికి వస్తే రిస్కులో పడతారు. ఆక్సిజన్​ పెట్టినంత మాత్రాన సీరియస్​ కండీషన్​లో ఉన్నట్టు కాదు. అటువంటి వాళ్లు కూడా చాలా మంది కోలుకుంటున్నారు’.

సెకండ్​ వేవ్​ రావడానికి కారణం ఏమిటి?

‘దేశంలో కరోనా సెకండ్​ వేవ్​ రావడానికి ప్రధాన కారణం ప్రజలు నిర్లక్ష్యమే. కరోనా మొదటివేవ్​ తగ్గాక చాలా మంది యువత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మాస్కులు వదిలేసి టూర్లు, పార్టీలు అంటూ తిరిగారు. అందులో చదువుకున్నవాళ్లు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ల వల్లే కరోనా కేసులు పెరిగాయి. ప్రభుత్వాలు చెప్పేవరకు చాలా మందికి సోయి లేకుండా పోయింది. చదువుకున్నవాళ్లకంటే పల్లెటూర్లలో ఉండే నిరక్షరాస్యులు చాలా జాగ్రత్తలు పాటించారు. అందుకే సెకండ్​ వేవ్​లో ఎక్కువగా యువత కరోనా బారిన పడ్డారు.

యువత వ్యాక్సిన్​ వేయించుకోకపోవడం కూడా ఓ ప్రధాన కారణం. ఇప్పటినుంచైనా జాగ్రత్తగా ఉంటే థర్డ్​వేవ్​ ముప్పును తప్పించుకోవచ్చు.

టీకా పంపిణీకి కేంద్రం సహకరించాలి. ఈ ఏడాది చివరినాటికి అందరికీ వ్యాక్సిన్​ ఇస్తామంటూ కేంద్రం అంటున్నది. అయితే ఈ ప్రక్రియను చిత్తశుద్ధితో చేయాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు ఉంటాయి. వ్యాక్సినేషన్​ విషయంలో కేంద్రం క్లారిటీతో ఉండాలి. అప్పుడే ఈ ప్రక్రియ వేగవంతం అవుతంది.’ అంటూ పలు విషయాలు మీడియాతో పంచుకున్నారు నాగేశ్వర్​ రెడ్డి.