Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్: భారత్ వైపే అందరి చూపు

By:  Tupaki Desk   |   18 Aug 2020 10:15 AM IST
వ్యాక్సిన్: భారత్ వైపే అందరి చూపు
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కోసం ఇప్పుడు అన్ని దేశాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రష్యా వ్యాక్సిన్ విడుదల కాగా.. దానిపై అందరిలోనూ అనుమానాలున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా 100కు పైగానే సంస్థలు కరోనా వ్యాక్సిన్ కోసం ట్రయల్స్ లో ఉన్నాయి.

అయితే వ్యాక్సిన్ల ఖార్ఖానా.. ప్రపంచంలోనే పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు తయారు చేసే దేశంగా భారత్ కు ఇంతకుముందు పేరుంది. పైగా ప్రపంచంలోనే అత్యంత చీప్ గా తక్కువ ధరకు భారత్ లో వ్యాక్సిన్లు తయారవుతాయి. పైగా మెరుగైన ఫలితాలను ఇచ్చాయి.

అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు మన దేశం నుంచే వ్యాక్సిన్ రావాలని.. అదే అందరికీ పంచాలనే ఆశతో ఉన్నాయి.

ప్రస్తుతం హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ నుంచి వస్తున్న కోవ్యాక్సిన్ మనదేశంలో తయారవుతున్న తొలి కరోనా వ్యాక్సిన్ టీకా. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ గత నెలలోనే మొదలయ్యాయి. ఇక జైడస్ క్యాడిలా రెడీ చేస్తున్న డీఎన్ఏ టైప్ వ్యాక్సిన్ రెండోదశలో ఉంది.

ఇక అన్నిటికంటే మెరుగైన ఫలితాలతో ఆక్స్ ఫర్డ్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ డిసెంబర్ నాటికి విడుదలయ్యే చాన్స్ ఉంది. ఇది మన భారత్ లోనూ సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారీలో భాగస్వామిగా ఉంది. ఈ క్రమంలోనే భారత్ నుంచే వ్యాక్సిన్ రావాలని.. అది అత్యంత చవకగా ఉంటుందని ప్రపంచదేశాలు ఆశిస్తున్నాయి.