Begin typing your search above and press return to search.

డిసెంబర్ నాటికి దేశంలోని అందరికీ వ్యాక్సిన్

By:  Tupaki Desk   |   29 May 2021 5:30 AM GMT
డిసెంబర్ నాటికి దేశంలోని అందరికీ వ్యాక్సిన్
X
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. అయితే , గతంలో రోజుకి నాలుగు లక్షలకి పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా , ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య రెండు లక్షల దిగువకు చేరింది. సెకండ్ వేవ్ విజృంభణ కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తోంది. అలాగే వేల సంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ కూడా దేశంలో శరవేగంగా సాగుతోంది. అయితే , అందరికి ఇవ్వడానికి సరిపడా వ్యాక్సిన్ లేకపోవడంతో కొంచెం సమస్యగా మారింది. ఇలాంటి తరుణంలో దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ పై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తవుతుందని శుక్రవారం ప్రకాశ్ జవదేకర్ అన్నారు.

అయితే దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేసిన కొద్ది గంటల్లోనే, ప్రకాశ్ జవదేకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాగా, వ్యాక్సినేషన్‌ పై రాహుల్ గాంధీ స్పందిస్తూ దేశంలో కేవలం మూడు శాతం జనాభాకు మాత్రమే వ్యాక్సిన్ అందిందని విమర్శించారు. కరోనా కట్టడిలో వ్యాక్సిన్‌ వేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేవకర్ మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబర్ నాటికి దేశంలో 216 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ గతవారం తెలిపింది. అంటే కనీసం 108 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్ పొందే అవకాశం ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ డిసెంబర్ 2021 వరకు ఇండియాలో అందరికీ వ్యాక్సిన్ అందజేయబడుతుందని రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాలి అని తెలిపారు. ఇప్పటివరకు దేశంలో 20 కోట్ల వ్యాక్సిన్లను అందజేశారు. డోస్‌ ల పరంగా భారత్ రెండవ స్థానంలో ఉంది. టీకా రేట్ల గురించి రాహుల్ గాంధీ ఒకవేళ ఆందోళన చెందుతుంటే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కరోనా వైరస్ టీకా కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తున్నాయనే దానిపై ఆయన దృష్టి పెట్టాలి. 18-45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారికి వ్యాక్సిన్‌ కోసం కోటాలు కేటాయించినప్పటికీ ఆ రాష్ట్రాలు టీకాలు వేయలేకపోయాయి అంటూ ప్రకాశ్ జవదేకర్ రాహుల్‌ పై ఫైర్ అయ్యారు.