Begin typing your search above and press return to search.

మలేరియా వ్యాధికి చెక్.. ప్రపంచంలో తోలి వ్యాక్సిన్ !

By:  Tupaki Desk   |   7 Oct 2021 7:30 AM GMT
మలేరియా వ్యాధికి చెక్..  ప్రపంచంలో తోలి వ్యాక్సిన్ !
X
మలేరియా వ్యాధికి ప్రధాన కారణం దోమకాటు. ఏడాది క్రితం మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచాన్నే కుదిపేస్తోంది. కంటికి కనిపించకుండా లక్షలాది మంది ప్రాణాలను చిదిమేస్తోంది. కాగా, కంటికి కనిపించే దోమలు వచ్చి శతాబ్దాలైంది. అయినా మనం వాటిని ఏమీ చెయ్యలేకపోతున్నాం. ముఖ్యంగా దోమల ద్వారా సంక్రమించే మలేరియా, ప్రాణాలు తీసేస్తోంది. అయినా సరే మనం ఇన్నేళ్లుగా వ్యాక్సిన్ తయారుచేసుకోలేకపోయాం. నిజానికి ఎన్నో వ్యాక్సిన్లు తయారుచేసినా వాటిలో మలేరియాతో పోరాడే శక్తి సరిపడా లేకపోవడంతో ఫలితం ఇవ్వలేకపోయాయి..

ప్రతి రెండు నిమిషాలకు ఒక పిల్లవాడు మలేరియాతో మరణిస్తున్నట్లు డబ్య్లుహెచ్ ఓ ట్వీట్ చేసింది. అధిక మలేరియా వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో పిల్లల మరణాలను తగ్గించడానికి WTS RTS మలేరియా వ్యాక్సిన్‌ను సిఫార్సు చేస్తోంది. 2025 నాటికి ప్రపంచం నుంచి మలేరియాను నిర్మూలించడమే ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం వారు తీవ్రంగా పని చేస్తున్నారు. 25 దేశాలలో నిర్మూలన కార్యక్రమం కూడా ప్రారంభించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మలేరియా వ్యాక్సిన్‌ను ఉప-సహారా ఆఫ్రికాలో ఉన్న పిల్లలలో విస్తృతంగా ఉపయోగించాలని నిర్ణయించింది. మలేరియా వ్యాప్తి ఆఫ్రికన్ దేశాలలో ఎక్కువగా ఉంది. మలేరియాతో ప్రతి సంవత్సరం దాదాపు 260,000 ఆఫ్రికన్ పిల్లలు మరణిస్తున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఇది చారిత్రాత్మక క్షణం అని ట్వీట్ చేశారు.

WHO ద్వారా ఉపయోగం కోసం ఆమోదించబడిన టీకా శాస్త్రీయ నామం RTS, S / AS01. WHO సంస్థ రెండు అతిపెద్ద సలహా సంస్థల ఆధారంగా సిఫార్సు చేసింది. 5 నెలల పైబడిన పిల్లలకు ఈ టీకాను ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. పిల్లలకు మొత్తం నాలుగు మోతాదులు ఉంటాయి. ఇప్పటివరకు, మూడు ఆఫ్రికన్ దేశాలలో 2.3 మిలియన్ డోసుల టీకా ఇచ్చారు. ఈ టీకా పూర్తిగా సురక్షితం అని నిరూపించారు. మలేరియా వ్యాధికి ప్రధాన కారణం దోమకాటు. ఏడాది క్రితం మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచాన్నే కుదిపేస్తోంది. కంటికి కనిపించకుండా లక్షలాది మంది ప్రాణాలను చిదిమేస్తోంది. దానికి వ్యాక్సిన్ కూడా సిద్ధమైందది. అయితే మన కంటికి కనిపించే దోమలు వచ్చి శతాబ్దాలైంది. అయినా మనం వాటిని ఏమీ చెయ్యలేకపోతున్నాం. ముఖ్యంగా దోమల ద్వారా సంక్రమించే మలేరియా.. ప్రాణాలు తీసేస్తోంది. అయినా సరే మనం ఇన్నేళ్లుగా వ్యాక్సిన్ తయారుచేసుకోలేకపోయాం.

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు కరోనా వ్యాక్సిన్లకు అనుమతులు ఇచ్చేశాయి. మలేరియా వ్యాక్సిన్‌కి అలా వెంటనే అనుమతులు ఇవ్వరు. ఇంకో రెండేళ్లపాటూ పరిశోధనలు కొనసాగిస్తారు. మరిన్ని ట్రయల్స్ జరుపుతారు. ఆ తర్వాతే అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కరోనాకి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారుచేస్తున్న పుణెలోని సీరం ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మలేరియా వ్యాక్సిన్ ఉత్పత్తికి కూడా డీల్ కుదుర్చుకుంది. ఏడాదికి 20 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తామని తెలిపింది