Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్
By: Tupaki Desk | 19 April 2021 3:35 PM GMTదేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టీకా పంపిణీని కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. మూడో దశ టీకా పంపిణీలో భాగంగా 18 ఏళ్లు నిండిన ప్రతీ పౌరుడికి టీకా అందించాలని మోడీ సర్కార్ నిర్ణయించింది.
మే 1 నుంచి దేశవ్యాప్తంగా కరోనా మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని కేంద్రప్రభుత్వం తెలిపింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంస్థలను ప్రోత్సహించడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా టీకా ఉత్పత్తి చేస్తున్న ఇతర కంపెనీల నుంచి పెద్ద ఎత్తున టీకాలను దిగుమతి చేసుకొని పంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.