Begin typing your search above and press return to search.
ప్రారంభమైన టీకా రిజిస్ట్రేషన్.. పోర్టల్ క్రాష్
By: Tupaki Desk | 28 April 2021 3:56 PM GMTకరోనా కల్లోలం వేళ కరోనా టీకా కోసం ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్నారు. 18-45 ఏళ్లలోపు వారికి టీకాలు వేసేందుకు ఈరోజు నుంచి రిజిస్ట్రేషన్ ను కోవిన్ పోర్టల్ ను ప్రారంభించారు. అయితే ప్రారంభించిన కొద్దిసేపటికే ఆ పోర్టల్ క్రాష్ అయ్యింది. దేశవ్యాప్తంగా యువత, మధ్య వయసు గల వారంతా కరోనా టీకా వేసుకునేందుకు ఆ పోర్టల్ ను ఓపెన్ చేయడంతో సర్వర్ బిజీ అయ్యిపోయి క్రాష్ అయ్యింది.
బుధవారం సాయంత్రం 4 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. కోవిన్ యాప్ పోర్టల్, ఉమాంగ్ యాప్ , ఆరోగ్యసేతు యాప్ ల సర్వర్ లు అన్నీ క్రాష్ అయ్యాయి. సర్వర్లో సమస్యలు తలెత్తడంతో రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ఇబ్బందులు తలెత్తాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే వేల సంఖ్యలో లాగిన్ కావడానికి ప్రయత్నించగా సర్వర్ క్రాష్ అయ్యింది.
దేశవ్యాప్తంగా లక్షలమంది ఒకేసారి పోటెత్తడంతో ఒక్క యాప్, వెబ్ సైట్ కూడా పనిచేయలేదు. మొబైల్ నంబర్ ఎంటర్ చేశాక చాలా మందికి ఓటీపీ కూడా రాలేదు. కొందిరికైతే యాప్ ఓపెన్ కాలేదు. దీంతో చాలా మంది సోషల్ మీడియాలో తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. స్క్రీన్ షాట్స్ పెట్టి తమ కోపాన్ని ప్రదర్శించారు.
దేశ ప్రజలంతా దరఖాస్తు చేస్తారని తెలిసి కూడా కేంద్రం సరైన చర్యలు తీసుకోలేదని.. ఇది అధికారుల అలసత్వానికి నిదర్శనం అని ప్రజలు ఆరోపిస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్ తో లక్షల కేసులు.. వేల మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా టీకాల వల్లే ప్రస్తుతం ఈ మహమ్మారిని అరికట్టవచ్చు. మందులు చికిత్సలు లేవు. అందుకే వ్యాక్సినేషన్ కు భారీ స్పందన వచ్చింది. అందుకే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కు జనం ఎగబడ్డారు. ఈ ప్రక్రియలో ఇంత అలసత్వం పనికిరాదని.. వ్యాక్సినేషన్ డ్రైవ్ పారదర్శకంగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.