Begin typing your search above and press return to search.

టీకా కొరత ఇంకెన్నాళ్లు.. జూన్.. జులైలో ఏమవుతుంది?

By:  Tupaki Desk   |   12 April 2021 4:30 AM GMT
టీకా కొరత ఇంకెన్నాళ్లు.. జూన్.. జులైలో ఏమవుతుంది?
X
పెరుగుతున్న కేసులు.. అంతకంతకూ విస్తరిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టానికి వ్యాక్సిన్ కు మించిన మందు మరొకటి లేదు. వ్యాక్సిన్ వచ్చే వరకు..అదెప్పుడు వస్తుందన్న ఎదురుచూపులు ఉండేవి. ఇప్పుడేమో.. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక.. వాటి ఉత్పత్తిలో జరుగుతున్న ఆలస్యం.. అందుకు అవసరమైన మౌలిక వసతుల్ని సిద్ధంగా ఉంచుకోవాల్సింది. అలాటిదేవీ లేకపోవటంతో పాటు.. ఉత్పత్తి అయిన టీకాల్ని విదేశాలకు ఎగుమతులు చేయటం కూడా దేశీయంగా కొరతకు కారణంగా చెప్పాలి.

టీకా కొరతకు కారణం.. ఉత్పత్తి తక్కువగా ఉండటమే. నిజానికి ఈ పరిస్థితిని ఇంతకు ముందే అంచనా వేశారు. కానీ.. దాన్ని అధిగమించేందుకు ప్రణాళికను సిద్ధం చేసినా.. ఆచరణలో మాత్రంలో అమలు కాకపోవటం కూడా ఒక కారణం. మొదట్లో వ్యాక్సిన్ వేసుకోవటానికి పెద్ద ఆసక్తి వ్యక్తం కాలేదు. తర్వాతిదశల్లో కేసుల సంఖ్య ఎక్కువగా నమోదు కావటంతో వ్యాక్సిన్ మీద ఆసక్తి ఎక్కువైంది. కొరతకుఇదో కారణం. ఉన్న పరిమితు వనరులతో తయారు చేస్తున్న వ్యాక్సిన్లు విదేశాలకు వెళుతున్నాయి.

ఇప్పటివరకు దేశం నుంచి 6.45 కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని విదేశాలకు ఎగుమతి చేశారు. దేశీయంగా టీకా కొరతకు ఇదో కారణంగా చెప్పాలి. దేశీయ అవసరాలకు తగ్గట్లు.. డిమాండ్లకు అనుగుణంగా ఉత్పత్తిని దేశీయంగా పరిమితం చేసి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేది. కానీ.. తయారు చేసిన వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇదే కొరతకు ముఖ్య కారణంగా చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నెలకు ఆరు కోట్ల డోసుల్ని సీరం సంస్థ.. నెలకు కోటి డోసుల్ని భారత్ బయోటెక్ చెబుతోంది. ఇందుకు అవసరమైన నిధుల్ని కేంద్రం సమకూరుస్తామని చెబుతున్నారు. దీంతో.. జూన్.. జులై నాటికి మాత్రమే వ్యాక్సిన్ కొరత కొలిక్కి వచ్చే వీలుందని చెబుతున్నారు. అంటే.. మరోమూడు నెలలు తిప్పలు తప్పనట్లే.

అంతేకాదు.. జూన్ నాటికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవీషీల్డ్ తో పాటు కోవాగ్జిన్ టీకాలతో పాటు జాన్సన్ అండ్ జాన్సన్.. జైడస్ క్యాడిలా.. నోవావ్యాక్స్ తో పాటు భారత్ బయోటెక్ వారి నేజల్ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రానుంది. అంతేకాదు.. రష్యా స్పూత్నిక్ తో పాటు మరో నాలుగు కంపెనీలు తయారు చేసిన టీకాలుకూడా అందుబాటులోకి రానున్నాయి. అంటే.. మరో మూడు నెలలు కొరత తిప్పలు తప్పనట్లే అన్న మాట.