Begin typing your search above and press return to search.

పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్.. నిపుణుల నిర్ణయం ఇదే

By:  Tupaki Desk   |   1 July 2021 3:30 PM GMT
పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్.. నిపుణుల నిర్ణయం ఇదే
X
కరోనా మహమ్మారి ఎప్పుడు అంత‌మైపోతుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. దాంతో స‌హ‌జీవ‌నం చేయాల్సిందేన‌ని కూడా కొంద‌రు అంటున్నారు. ఇదే నిజ‌మైతే.. వ్యాక్సిన్ తీసుకోని పిల్ల‌ల ప‌రిస్థితి ఏంట‌న్న ఆందోళ‌న అలాగే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచంలోని అన్ని దేశాల్లోనూ 18 ఏళ్లు పైబ‌డిన వారికే వ్యాక్సిన్లు వేస్తున్నారు. ప‌లు దేశాల్లో పిల్ల‌ల‌కు ఇచ్చే వ్యాక్సిన్ విష‌య‌మై ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే.. మ‌న దేశంలో కొవీషీల్డ్ వ్యాక్సిన్ ను స‌ర‌ఫ‌రా చేస్తున్న సీరం ఇనిస్టిట్యూట్.. పిల్ల‌ల‌పై ట్ర‌య‌ల్స్ చేసేందుకు సిద్ధ‌మైంది. ఈ మేర‌కు డీసీజీఐకి ద‌ర‌ఖాస్తు కూడా చేసింది. 2 నుంచి 17 సంవ‌త్స‌రాలో లోపు 920 మంది పిల్ల‌ల‌పై క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ జ‌రిపేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరింది. దీంతో.. ఈ విష‌యాన్ని ప‌రిశీలించేందుకు నిపుణుల క‌మిటీ అభిప్రాయాన్ని కోరింది డీసీజీఐ.

అయితే.. నిపుణుల క‌మిటీ మాత్రం భిన్నంగా స్పందించింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో చిన్నారుల‌పై కొవీషీల్డ్ ట్ర‌య‌ల్స్ స‌రికాద‌ని చెప్పింది. ప్ర‌పంచంలోని ఏ దేశ‌మూ ఇప్ప‌టి వ‌ర‌కు కొవీషీల్డ్ ను వ్యాక్సిన్ గా గుర్తించ‌లేద‌ని తెలిపింది. ఈ వ్యాక్సిన్ పిల్ల‌ల‌పై ఎలాంటి ప్ర‌భావం చూపుతుంది? ర‌క్ష‌ణ‌, ఇమ్యునోజెనిసిటీ డేటా వంటివి ప‌రిశీలించిన త‌ర్వాతే తుది నిర్ణ‌యం చెబుతామ‌ని క‌మిటీ తెలిపింది.