Begin typing your search above and press return to search.

రిజిస్ట్రేష‌న్ లేకుండానే వ్యాక్సిన్ ..కేంద్రం సంచలన నిర్ణయం, వారికోసమేనట ?

By:  Tupaki Desk   |   16 Jun 2021 9:30 AM GMT
రిజిస్ట్రేష‌న్ లేకుండానే వ్యాక్సిన్ ..కేంద్రం సంచలన నిర్ణయం, వారికోసమేనట ?
X
కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా టీకా విషయంలో గ్రామీణులు, పట్టణ ప్రాంతాల్లో నివసించే మురికి వాడల ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొద్ది నెలలుగా కరోనా టీకాను అందిస్తున్న కేంద్రం ,అందుకోసం పలు ఆన్‌లైన్ యాప్‌ల ద్వార రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేప‌థ్యంలో ఇక‌పై రిజిస్ట్రేష‌న్ అవ‌స‌రం లేకుండా టీకా వేసుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం మార్గాన్ని సుల‌భ‌త‌రం చేసింది. అంతేకాదు, టీకా వేయించుకునేందుకు ఎలాంటి అపాయింట్‌ మెంట్ లేద‌ని తేల్చి చెప్పింది.

వివిధ యాప్‌ ద్వార రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి మాత్రమే టీకా స్లాట్‌ను కేటాయించి వారికి మాత్రమే వ్యాక్సిన్ చేస్తున్నారు. అయితే దీని ద్వార గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరక్ష్యరాస్యులు మరియు ఇతర పేదలతో పాటు ,పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడల్లో నివసించే పేదలకు ఇబ్బందికరంగా మారుతుందని కేంద్రం భావించింది. ఈ నిర్ణయం వల్ల గ్రామీణ ప్రజలు ముందుకు వచ్చి టీకా వేసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు గుర్తించింది. దీంతో వారికి ముందు రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేకుండా టీకా వేయాలని నిర్ణయించింది. అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియను వ్యాక్సినేషన్ సెంటర్ల ద్వార చేయనున్నారు..ప్రారంభంలో పట్టణ ప్రాంతలతో పాటు ,ఆయా సెంటర్లలో ఇదే విధమైన పద్దతి ఉండేది.

టీకా వేయించుకునే వారి ఆధార్ కార్డు తీసుకువెళితే వారు దాని ద్వార రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి వ్యాక్సిన్ వేసేవారు..ఇప్పుడు కూడా అదే పద్దతిని గ్రామీణ ప్రాంత ప్రజలకు కల్పించారు. నేప‌థ్యంలో 18 ఏళ్లు దాటిన వారు నేరుగా సమీపంలోని వ్యాక్సినేషన్‌ కేంద్రానికి వెళ్లి టీకా వేయించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం మార్గ‌దర్శ‌కాలు విడుద‌ల చేసింది. వ్యాక్సినేటర్లు అక్కడికక్కడే రిజిస్ట్రేషన్‌ చేసి, టీకా వేస్తారని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, పట్టణాల్లోని మురికివాడల ప్రజలను ఆరోగ్య, ఆశా కార్యకర్తలు సమీపంలోని టీకా కేంద్రాలకు తీసుకెళ్లి అక్కడికక్కడే రిజిస్ట్రేషన్‌ చేసి టీకాలు ఇప్పిస్తారని కేంద్ర ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది. 1075 హెల్ప్‌లైన్‌ నంబరు ద్వారా కూడా రిజిస్ట్రేషన్‌ చేస్తారని పేర్కొంది. ఈ పద్ధతులన్నీ ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసమని అధికారులు చెప్ప‌డం గ‌మ‌నార్హం.