Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్లు పనిచేయడం లేదు..! ఇదిగో సాక్ష్యం..!

By:  Tupaki Desk   |   7 March 2021 7:30 AM GMT
వ్యాక్సిన్లు పనిచేయడం లేదు..! ఇదిగో సాక్ష్యం..!
X
కరోనాకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. మనదేశంలో సీరమ్​ ఇన్​స్టిట్యూట్​, భారత్​ బయోటెక్​ ఈ వ్యాక్సిన్లు తయారుచేశాయి. ఇప్పటికే వ్యాక్సినేషన్​ మొదటి దశ పూర్తయ్యింది. రెండో దశ వ్యాక్సినేషన్​ కూడా కొనసాగుతున్నది. అయితే ఈ వ్యాక్సిన్లు అసలు పనిచేస్తున్నాయా? అని కొందరు అనుమానిస్తున్నారు.. అందుకు కారణం కరోనా వ్యాక్సిన్​ రెండు డోసులు తీసుకున్నాక కూడా కరోనా పాజిటివ్​ నిర్ధారణ అవుతుండటమే.

అయితే మనదేశంలో ఇప్పటికే హెర్డ్​ ఇమ్యూనిటీ వచ్చేసిందని కొందరు శాస్త్రవేత్త​లు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్​ పంపిణీ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కొన్ని రాష్ట్రాల్లో కేసులు కూడా నమోదవుతున్నాయి. అయితే కరోనా వ్యాక్సిన్​ రెండు డోసుల్లో ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు డోసులు తీసుకున్న తర్వాత కొంత కాలానికి మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంటే యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయి. తద్వారా కరోనా రాదు. అయితే రెండు డోసులు తీసుకున్నాక కూడా కరోనా సోకుతుండటంతో ఆందోళన నెలకొన్నది.

గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన ఆరోగ్య కార్యకర్త జనవరి 16న మొదటి డోస్ తీసుకున్నాడు. దాదాపు నెల తర్వాత ఫిబ్రవరి 15న రెండో డోసు తీసుకున్నాడు.

అయితే ఇటీవల అతడికి జ్వరం వచ్చింది. దీంతో కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే కరోనా సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే రెండు డోసులు వ్యాక్సిన్​ తీసుకున్నాక కూడా కరోనా సోకడంతో ఆందోళన నెలకొన్నది. అయితే ఈ విషయంపై వైద్య వర్గాలు స్పందిస్తూ .. కరోనా వ్యాక్సిన్​ తీసుకున్నాక 45 రోజుల అనంతరం యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయని చెబుతున్నారు. కాబట్టి వ్యాక్సిన్​ తీసుకున్నామని ప్రజలెవరూ నిర్లక్ష్యం వహించవద్దని చెబుతున్నారు. వ్యాక్సిన్​ తీసుకున్నాక కూడా మాస్కులు ధరించాలని.. భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.

ప్రస్తుతం వ్యాక్సినేషన్​ మొదలు కావడంతో చాలా మంది ప్రజలు జాగ్రత్తలు మరిచారు. గుంపులు గుంపులుగా రోడ్ల మీద తిరుగుతున్నారు. దీంతో కేసుల సంఖ్య పెరుగుతున్నది. అయితే కరోనా వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.