Begin typing your search above and press return to search.
బాబుపై మండిపడ్డ మాజీ ఆప్తుడు
By: Tupaki Desk | 10 Sep 2016 5:43 AM GMTఏపీ ముఖ్యమంత్రి - టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీరుపు ఆయన ఒకనాటి ఆప్తుడు - మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు గడిచినా ఇంకా వెనుకబడిన బీహార్ - జార్ఖండ్ - చత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాలు హోదాను ఆశించడంలోనూ తప్పులేనపుడు... అర్దరాత్రి విభజన చెందిన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్రానికి ఏం సమస్య ఉందని వడ్డే ప్రశ్నించారు. నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తిరస్కరణ ఏమాత్రం న్యాయం కాదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు ప్రత్యేక హోదాకు అడ్డుపడుతున్నాయంటూ కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ - వెంకయ్యనాయుడు మాట్లాడుతుండటం హాస్యాస్పదమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను ఏ రాష్ట్రం కూడా వ్యతిరేకించడం లేదని చెప్పిన వడ్డే ఇదే విషయాన్ని బలంగా వినిపిస్తూ సీఎం చంద్రబాబు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని సూటిగా ప్రశ్నించారు.
పార్లమెంట్ లో ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హామీ ఇవ్వగా కేంద్ర మంత్రివర్గం కూడా నాడు తక్షణమే తీర్మానం చేసి తదుపరి చర్యకు ప్లానింగ్ కమిషన్ కు పంపిందని వడ్డే శోభనాద్రీశ్వరరావు గుర్తుచేశారు. ఫైనాన్స్ కమిషన్ చేసిన సిఫార్సులను సలహా మాత్రమే తప్ప కేంద్రం ఆమోదించవచ్చు - మార్పులు చేయవచ్చు - లేక తిరస్కరించనూ వచ్చని స్పష్టం చేశారు. హోదా ఇచ్చే అధికారం ప్రధాని - కేంద్ర మంత్రులు - రాష్ట్రాల ముఖ్యమంత్రులు - ప్లానింగ్ కమిషన్ సభ్యులు (ప్రస్తుతం నీతి ఆయోగ్) - ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా ఉండే జాతీయ అభివృద్ధి మండలికే ఉంటుందన్నారు. ఇప్పటికే 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉందంటూ వడ్డే గుర్తుచేస్తూ ఇదే రీతిలో ఏపీకి సైతం న్యాయం చేయవచ్చని చెప్పారు. ఏడు జిల్లాలు అత్యంత వెనుకబడి ఉన్నాయని కేంద్రం అంగీకరించడాన్ని ప్రస్తావిస్తూ 2014-15లో ఉన్న 16వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటు దీర్ఘకాలంలో కూడా కొనసాగుతూనే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఏపీ సీఎం చంద్రబాబు ఎందుకు తన ఖర్చులను భారీగా చేస్తున్నారని ప్రశ్నించారు. పైగా నిధులు రాబట్టేందుకు సరైన పోరాటం చేయడంలో ఎందుకు చంద్రబాబు వెనబడుతున్నారని నిలదీశారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్ కు ప్రకటించిన ప్యాకేజీలో అంతా డొల్లతనమే ఉందని వడ్డే శోభనాధ్రీశ్వరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన జైట్లీ - ప్యాకేజీ ప్రకారం కేవలం రూ.8 వేల కోట్లు మాత్రమే నిధులు వస్తాయని తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టుకు భూ సేకరణతో కలిపి సుమారు రూ.32 వేల కోట్లు ఖర్చవుతుందని నిపుణులు అంచనా వేశారన్నారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటి వరకు రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చారని, విజయవాడ - గుంటూరు డ్త్రెనేజీలకు రూ.వెయ్యి కోట్లు ఇచ్చారని తెలిపారు. ప్యాకేజీ లెక్కల ప్రకారం మరో రూ.వెయ్యి కోట్లు మాత్రమే నిధులు వచ్చే అవకాశం ఉందని వీటిని బాబు ఎప్పుడు అడుగుతారని వడ్డే ప్రశ్నించారు. వెనుకబడిన ఏడు జిల్లాలకు జిల్లాకు రూ.50 కోట్ల వంతున ఇస్తే....ఒరిస్సాలో వెనుక బడిన జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.250 కోట్ల చొప్పున ఇచ్చారని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందదని, ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. హోదా సాధించడం ద్వారా పరిశ్రమలు - ఆదాయ పన్ను - ఎక్సైజ్ పన్నుల మినహాయింపుతోపాటు మరెన్నో రాయితీలు వస్తాయని, పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని పేర్కొన్నారు. ఇవన్నీ గమనించి బాబు పోరాటం చేయాలని వడ్డే హితవు పలికారు.