Begin typing your search above and press return to search.
ఆ ఆంటీకి నెటిజన్లు ఫ్లాట్.. పోలీసులకు షాక్
By: Tupaki Desk | 2 Aug 2018 7:18 AM GMTపిచ్చ పద్నాలుగు రకాలు. అంటే అన్నామంటారు కానీ.. తిన్నది అరక్క చేసే పిచ్చ పనులు తమకే పరిమితం చేసుకోకుండా.. పక్కనున్నోళ్లను సైతం కెలుకుతున్న తీరు చూస్తే కుదురుగా ఉండేవాళ్లకు ఒళ్లు మండాల్సిందే. జాగ్రత్తలు చెప్పాల్సిన పెద్దలు సైతం.. తెలిసీ తెలియకుండా పిచ్చ పనులు చేసే బ్యాచ్ కు తోడు కావటం ఓ సిత్రంగా మారింది.
కికీ ఛాలెంజ్ పేరుతో.. ఓ పిచ్చ పని ప్రపంచంలోని యూత్ ను తెగ అట్రాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏ విషయమైతే వివాదంగా మారుతుందో.. ఏ అంశాన్ని పట్టుకుంటే తాము ఓవర్ నైట్ ప్రముఖులుగా మారతామో అన్న దానిపై అదే పనిగా ఆలోచించే బ్యాచ్ చేసే చిత్రమైన పనులు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారాయి.
24 ఏళ్ల కెనడియన్ యువ గాయకుడు డ్రేక్ గ్రాహం అనే అతను తన తాజా అల్బం ఇన్ మై ఫీలింగ్స్ అనే పాటలో కికీ డూ యూ లవ్ మీ అని ప్రశ్నిస్తాడు. వాస్తవానికి.. ఈ పాటకు కికీ ఛాలెంజ్ కు సంబంధం లేదు. కానీ.. ఇంటర్నెట్ కమెడియన్ షిగ్గీ ఎప్పుడైతే ఆయన పాటకు డ్యాన్స్ చేసి.. ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారో.. అప్పటి నుంచి ఈ పిచ్చ పనిని ఫాలో అవుతున్నారు. కదులుతున్న కారులో నుంచి బయటకొచ్చి డ్యాన్స్ వేయటం.. ఆ తర్వాత మళ్లీ కారెక్కి ఈ ప్రమాదకరమైన పని ఇప్పటి యూత్ ను తెగ ఆకర్షిస్తోంది.
అయితే.. దీని కారణంగా పెద్ద ఎత్తున ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో.. వీటికి చెక్ పెడుతూ పలు దేశాల పోలీసులు పరిమితులు విధిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గుజరాత్లోని వడోదర ప్రాంతానికి చెందిన ఒక ఆంటీ కికీ ఛాలెంజ్ పేరుతో వేసిన డ్యాన్స్ ఇప్పుడు వైరల్ గా మారింది.
సెలబ్రిటీలు చేసే డ్యాన్స్ కంటే వడోదర ఆంటీ వేసిన స్టెప్పుల్ని ఫాలో అవుతున్నారు. రాత్రికి రాత్రి ఈ ఆంటీ వేసిన స్టెప్పులు తెగ ఫేమస్ అయిపోయాయి. బాధ్యత లేకుండా వ్యవహరించే కుర్రకారుకి మంచి చెప్పే వయసులో ఉన్న ఆంటీ ఉత్సాహంతో వేసిన స్టెప్పులపై పలువురు హర్షం వ్యక్తం చేస్తుంటే.. అదే రీతిలో పలువురు తప్పు పడుతున్నారు. ఇక.. పోలీసులు ఈ వడోదర ఆంటీ ఎవరన్న దానిపై ఆరా తీయటం మొదలెట్టారు.