Begin typing your search above and press return to search.
మన వేప చెట్లకు ఏమైంది? నిలువునా ఎండిపోతున్న వైనం
By: Tupaki Desk | 27 Oct 2021 1:30 AM GMTఇప్పుడంటే తగ్గిపోయాయి కానీ.. నలబై ఏళ్ల క్రితం వరకు కూడా ఇంటి ముందు వేప చెట్టు లేని ఇళ్లు గ్రామాల్లో ఉండేవి కావు. ఆ మాటకు వస్తే.. నిద్ర లేచింది మొదలు.. వేప పుల్ల తీసుకొని దంతాల్ని శుభ్రం చేసుకోవటం తెలిసిందే. పేస్టులు.. బ్రష్ లు వాడకం పెరిగిపోయిన తర్వాత వేపపుల్లల్ని వాడే వారు తగ్గారు. ఆ మాటకు వస్తే ఇవాల్టికి ఆయుర్వేద ఉత్పత్తులతో పాటు.. వ్యవసాయానికి వాడే పిచికారీల్లో వేప పిట్టు.. వేపనూనెను పెద్ద ఎత్తున వాడటం తెలిసిందే. అలాంటిది ఏమైందో ఏమో కానీ ఇప్పుడు ఏపీ.. తెలంగాణ.. కర్ణాటక రాష్ట్రాల్లోని వేప చెట్లకు ఏదో అయ్యిందని చెబుతున్నారు. వేప చిగుర్లు దగ్గర నుంచి కింది వరకు క్రమంగా ఎండిపోతూ.. చెట్లు నిర్జీవంగా మారిపోతున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
ఎందుకిలా? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మొవ్వలు.. చిగుర్లు.. లేత కొమ్మలు.. ఆకులు ఎర్రగా మారి రాలిపోతున్నాయి. పూత.. కాయలు కుళ్లిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయని.. పది శాతం చెట్లు ఎండిపోతున్నట్లుగా చెబుతున్నారు. సేంద్రియ వ్యవసాయంలో కీలకంగా ఉండే వేప చెట్లే.. ఇప్పుడు ఉన్నట్లుండి చచ్చిపోవటం షాకింగ్ గా మారింది. పల్లెలు.. పట్టణాల్లో ఇదో హాట్ టాపిక్ గా మారింది.
అయితే.. తాజాగా కనిపిస్తున్న బెడద వేప చెట్లకు కొత్తేం కాదని.. కొన్ని ఏళ్లుగా ఇలాంటి సమస్య ఎదురవుతుందని చెబుతున్నారు. టీ మస్కిటో బగ్ పుణ్యమా అని రాత్రిళ్లు వేప చెట్లపై చేరి రసాన్ని పీల్చివేయటంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని చెబుతన్నారు. నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. టీ మస్కిటో బగ్ జీవితకాలం 22 రోజులు అని.. ఈ పురుగు ఉదయం.. సాయంత్రం వేపచెట్లను ఆశించి దాని రసం పీల్చటంతో చెట్టు ఎండిపోతుందని చెబుతున్నారు.
పగటిపూట ఎక్కడైనా పొదల్లో దాక్కుని ఉంటుందని.. అధిక వర్షాల కారణంగా కూడా ఇలా జరుగుతుందని చెబుతన్నారు. నల్లటి తల.. ఎర్రటి గోధుమ వర్ణంలో ఉంటుందని చెబుతున్నారు. ఈ పురుగు నివారణకు 2 మి.లీ. ప్రొపినోఫాస్ లేదా 0.2 గ్రాముల థయోమిథాక్సామ్ లేదా 2 మి.లీ. డయోమిథోయేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే ఫలితం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏమైనా.. వేప చెట్లు ఎండిపోయి చచ్చిపోతున్న వైనం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.