Begin typing your search above and press return to search.

జాతీయ గీతం విలువ తెలియని ఎమ్మెల్యే!

By:  Tupaki Desk   |   19 Dec 2016 6:45 AM GMT
జాతీయ గీతం విలువ తెలియని ఎమ్మెల్యే!
X
చేతిలో అధికారం ఉంటే మాత్రం.. ఏదైనా చేసేస్తామనుకోవటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ.. ఆచితూచి వ్యవహరించాల్సింది పోయి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే.. ఎలాంటి తిప్పలు ఎదురవుతాయో.. పశ్చిమబెంగాల్ అధికారపార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే వైశాలి దాల్మియాకు ఇప్పుడు అర్థమై ఉంటుంది.

చేతిలో ఉన్న ఫోన్ ను ఎప్పడు పడితే అప్పుడు వాడేస్తే ఎన్ని ఇబ్బందులన్న విషయం తెలీయటమే కాదు..జైలుకు వెళ్లే పరిస్థితి తెచ్చుకోవటం చూస్తే.. చిన్న నిర్లక్ష్యానికి ఆమె భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకీ.. దీదీ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే చేసిన తప్పేంటి? జైలుకు వెళ్లేంత నిర్లక్ష్యం ఆమేం చేశారన్నది చూస్తే..

పశ్చిమబెంగాల్ లోని హోరా ప్రాంతంలో జరిగిన ఒక క్రీడా కార్యక్రమానికి స్థానిక అధికారపార్టీ ఎమ్మెల్యే వైశాలి దాల్మియా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. అందరూ నిలుచొని.. దేశభక్తిభావంతో తన్మయత్వం చెందుతూ.. గుండెల దగ్గర చేతులు పెట్టుకొని ఉన్న వేళ.. ఎమ్మెల్యే మాత్రం అందుకు భిన్నంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉండటం కనిపించింది.

దీంతో.. కెమేరా కళ్లు అన్నీ ఆమె మీదకు ఫోకస్ చేశాయి. తాను చేసింది ఎంత పెద్ద తప్పు అన్న విషయం అర్థమైన ఆమె.. వెంటనే కాల్ కట్ చేసేశారు. అయితే.. అపటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. జాతీయ గీతాన్ని అవమానించేలా వ్యవహరించారన్న విమర్శలు ఆమె మీదకు జడివానలా కురిశాయి. జాతీయ గౌరవానికి భంగం వాటిల్లేలా వ్యవహరిస్తే..సదరు చట్టంలోని మూడో సెక్షన్ ప్రకారం మూడేళ్ల జైలుశిక్ష.. లేదంటే జరిమానాను విధిస్తారు. తాజాగా మహిళా ఎమ్మెల్యే జాతీయ గీతాన్ని ఆలపించే సమయంలో సెల్ మాట్లాడటంపై చట్టం ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/