Begin typing your search above and press return to search.
ముస్లింలకు మా హాస్పిటల్ లో అనుమతి లేదు..ఎందకంటే?
By: Tupaki Desk | 21 April 2020 12:30 AM GMTదేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకి మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైన తోలి నాళ్లలోనే ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో కరోనా కొంచెం కంట్రోల్ లోకి వచ్చింది. అయితే , ఆ తరువాత ఢిల్లీ మర్కజ్ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగాయి. దాదాపుగా దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఢిల్లీ మర్కజ్ ఘటన వల్లే కరోనా కేసులు పెరిగాయి అనే ఆరోపణలు అయితే , ఉన్నాయి. కానీ , ఈ మహమ్మారి వ్యాప్తికి ఏ ఒక్క మతాన్ని నిందించడం సమంజసం కాదు.
ఈ తరుణంలోనే మా హాస్పిటల్ లో ముస్లింలకు అనుమతి లేదంటూ ఉత్తర్‌ప్రదేశ్ లోని మీరట్ ప్రాంతంలో ఉన్న ఓ హాస్పిటల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ..ఉత్తర్‌ప్రదేశ్ లోని మీరట్ ప్రాంతంలో వాలంటీస్ అనే క్యాన్సర్ హాస్పిటల్..ముస్లింలకు కరోనావైరస్ సోకలేదని నిర్దారణ అయ్యాకే వారిని ఆసుపత్రిలో చేర్చుకుంటామంటూ ఓ పత్రికలో యాడ్ ప్రకటించింది. దేశంలో కరోనా వ్యాప్తికి ఢిల్లీ జమాత్ కు వెళ్లొచ్చిన ముస్లింలే కారణమంటూ ఆరోపించింది. అంతేకాకుండా హిందువులు, జైనులను కూడా దుర్మార్గులు అంటూ దూషణలు గుప్పిస్తూ.. ఈ రెండు సంపన్న వర్గాలు పీఎం కేర్స్ ఫండ్ కు భారీగా విరాళాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
ఈ పోస్ట్ వివాదాస్పదం కావడం తో హాస్పిటల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మతాలను కించపరుస్తూ ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేసినందుకు హాస్పిటల్ మేనేజ్‌మెంట్ పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరోనా నెగటివ్ వస్తేనే ముస్లింలను ఆసుపత్రిలోకి అనుమతిస్తాం అని చెప్పడం దారుణం. ఈ వార్తని నిజంగా ఆ హాస్పిటల్ యాజమాన్యమే పత్రికలో ప్రకటన కి ఇచ్చింటే ..దాని కంటే పెద్ద తప్పు మరొకటి ఉండదు. ఎవరో కొందరు చేసిన తప్పుకి అందరిని బద్నామ్ చేయడం కరెక్ట్ కాదు. అది కూడా ఒక హాస్పిటల్ ఇలా మతాలు , కులాలు అంటూ ప్రకటన ఇవ్వడం అంత మంచింది కాదు. ఏ మతం వారైనా ..ఏ కులం వారైనా కూడా చేతులెత్తి మొక్కేది ఒక్క డాక్టర్ కి మాత్రమే. డాక్టర్ ను దేవుడు తో పోల్చే ఈ సమాజంలో మా హాస్పిటల్ లోకి ముస్లింలకు అనుమతి లేదు అంటూ ప్రకటించడం హేయమైన చర్య. ప్రస్తుతం యూపీ అంతటా 970 కరోనా కేసులు నమోదుకాగా, 14 మంది చనిపోయారు.