Begin typing your search above and press return to search.
అట్లుంటది వైసీపీలోకి వెళ్తే వల్లభనేని వంశీ.. మొహం మీదే చెప్పేసిన మహిళ
By: Tupaki Desk | 30 Nov 2022 9:46 AM GMTపాపం.. వల్లభనేని వంశీ.. చారిత్రాత్మకంగా ప్రాధాన్యం ఉన్న గన్నవరం నుంచి టీడీపీ టిక్కెట్ మీద గెలిచి అధికార వైసీపీ పంచన చేరిన ఆయనకు అన్నీ దుశ్శకునాలే. వైసీపీ ఆయన్ను చేర్చుకున్నట్లు నటించినా... కలుపుకోలేదు.. దీంతో అసెంబ్లీలో ఆయన అధికార పార్టీ సభ్యులతో కూర్చోవడం లేదు.. ఎలాగూ టీడీపీకి దూరమయ్యారు కాబట్టి ఆ పార్టీ సభ్యుల పక్కనా స్థానం లేదు. అలా శాసన సభలో ఎవరికీ చెందనివారిగా ఓ పక్కన కూర్చోవడం చూస్తే జాలి కలగక మానదు. దీనినే చేసుకున్నవాడికి చేసుకున్నంత అని కూడా అంటారు. ఇక ఆ మధ్య ఎన్టీఆర్ కుమార్తె, టీడీపీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి గురించి కలలో కూడా ఎవరూ ఊహించని వ్యాఖ్యలు చేసి జీవితాంతం చెరిగిపోని చెడ్డ పేరు తెచ్చుకున్నారు. విభేదాలు ఎన్ని ఉన్నప్పటికీ.. ఆదరించి, చేరదీసి.. ఎమ్మెల్యేను చేసిన పార్టీ అధినేత, ఆయన కుటుంబంపై వంశీ చేసిన వ్యాఖ్యలు ఎవరికీ రుచించలేదు. బహుశా పైకి కనిపించనప్పటికీ వైసీపీ వాళ్లకు కూడా ఇదే అభిప్రాయం ఉండి ఉంటుంది.
నియోజకవర్గంలో త్రిముఖ సెగ గన్నవరం నియోజకవర్గం సామాజికపరంగా సున్నితమైనది. ఓ పట్టాన కొరుకుడు పడనిది. అధికార వైసీపీ నుంచి ఇక్కడ డాక్టర్ దుట్టా రామచంద్రరావు కీలక నాయకుడు.దివంగత సీఎం వైఎస్ కు, ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితులు. దివంగత వంగవీటి రంగా హయాంలో, ఆ తర్వాత కూడా దుట్టా రామచంద్రరావు డాక్టర్ వైఎస్ వెంట నడిచారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావును వంశీ స్వల్ప మెజారిటీతో గెలిచారు. అయితే, తొలినాళ్లలో టీడీపీ తరఫున బలంగానే గళం వినిపించిన వంశీ రెండో ఏడాది నుంచి వైసీపీ పంచన చేరారు.
దీంతో ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ త్రిముఖ నాయకత్వం నెలకొంది. పార్టీ, ప్రభుత్వపరంగా వంశీ చేపట్టే కార్యక్రమాలకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. మరోవైపు వంశీపై మిగతా ఇద్దరూ.. దుట్టా, యార్లగడ్డ వెంకట్రావు గతంలో బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇప్పటికీ వంశీ అంటే వారికి గిట్టనే గిట్టదు. కాగా, ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వంశీకి టిక్కెట్ పక్కా అని చెప్పలేని పరిస్థితి.
చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం లేదనేది సామెత. వల్లభనేని వంశీ విషయంలో ఇప్పుడీ విషయం స్పష్టంగా తెలుస్తోంది. టీడీపీ పట్ల మనసులో అభిమానం ఉన్నప్పటికీ ఆయన చేయరాని తప్పు చేశారు. పైగా చంద్రబాబు కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషించి తటస్థుల కోణంలోనూ చీప్ అయిపోయారు. అందులోనూ ఎంతో ఆదరించిన ఎన్టీఆర్ కుటుంబానికి మేలు చేయకపోయినా ఫర్వాలేదు. దుర్భాషలతో వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడడం సత్సంప్రదాయం కాదు. ఈ విషయం వంశీకి తెలుసు. కానీ... అధికార వైసీపీ ప్రోద్భలంతో ఆయన అలా మాట్లాడినట్లు స్పష్టమవుతోంది.
మొహంలో ఏదీ నాటి కళ వల్లభనేని వంశీ స్పురద్రూపి. ముఖంలో వర్ఛస్సు ప్రస్ఫుటంగా కనిపించేది. మంత్రి పదవులేమీ దక్కనప్పటికీ.. టీడీపీ హయాంలో ఆయన మొహం వెలిగిపోతుండేది. కానీ, ఇప్పుడు వంశీని లోలోన మదనపడుతున్నట్లు ఆయన్ను చూస్తే తెలుస్తోంది. అటు టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన కుమారుడును దూషించాలంటూ వస్తున్న ఆదేశాలను కాదనలేకనో ఏమో.. వంశీ నలిగిపోతున్నట్లు స్పష్టమవుతుంది. మరోవైపు అసలు వంశీ పార్టీ మారడాన్ని ఎవరూ ఊహించలేదు. 2019 ఎన్నికల సమయంలోనే హైదారబాద్ లోని ఆయన ఆస్తులపై దాడులు జరిగినట్లు, వాటిని చికాకు చేస్తామని బెదిరింపులు వచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే, ఆ ఎన్నికల తర్వాత వంశీ పార్టీ మారడంతో అంతా సద్దుమణిగింది. అలా కాకుండా ఓ చింతమనేని ప్రభాకర్ లా పోయిందేది పోతుంది అనుకుంటూ నిలిచి ఉంటే వంశీ స్థాయి మరోలా ఉండేది.
గడపగడపలో మొహం మీదనే..వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు కార్యక్రమంలో వంశీకి ఎదురైన అనుభవం ప్రస్తుతం ఆయన పరిస్థితిని చాటుతోంది. గన్నవరం పట్టణంలోని రాయ్‌నగర్ పరిసరాల్లో మంగళవారం గడపగడపకు నిర్వహించారు. కల్యాణ మండపం సమీపంలోని ఓ అపార్టుమెంట్‌కు వెళ్లిన ఎమ్మెల్యే వంశీమోహన్.. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ.. 'అంతా బాగుంది గానీ మీరు వైకాపాకు వెళ్లడమే బాలేదు. స్థానికంగా ప్రతిష్ఠ కూడా దిగజారింది' అని పేర్కొన్నారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ కొన్ని పరిస్థితుల వల్ల వైకాపాకు మద్దతు పలికాల్సి వచ్చిందని, ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. మొత్తానికి వంశీ- వైసీపీ కథ అలా ఉందన్నమాట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.