Begin typing your search above and press return to search.

పవన్ కోసం ఆర్జీవీతో గొడవపెట్టుకున్న వల్లభనేని వంశీ: ఎందుకంటే..?

By:  Tupaki Desk   |   10 Dec 2021 4:33 AM GMT
పవన్ కోసం ఆర్జీవీతో గొడవపెట్టుకున్న వల్లభనేని వంశీ: ఎందుకంటే..?
X
వల్లభనేని వంశీ ఇటీవల వార్తల్లో నానుతున్నారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ, వల్లభనేని వంశీ మధ్య సాన్నిహిత్యం ఉండేది.

కానీ వీరిద్దరి మధ్య ఓ విషయంలో మనస్పర్థలు వచ్చాయట. అందుకు పవన్ కల్యాణే కారణమట. పవన్ కల్యాణ్ కోసం వల్లభనేని వంశీ ఆర్జీవితో గొడవపడ్డారట. ఆ విషయాన్ని వల్లభనేని వంశీ ఇటీవల మీడియాకు తెలిపారు. వైరల్ గా మారిన వంశీ వ్యాఖ్యల విశేషాలేంటంటే..?

రక్తచరిత్ర.. ఈ సినిమా గురించి తెలియని సినీ ప్రేక్షకులు లేరు. సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో రెండు పార్ట్ లుగా వచ్చి హడావుడి సృష్టించింది.

ఏపీలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా కొన్ని మార్పులు చేసి ఈ సినిమాను తీసినట్లు స్వయంగా ఆర్జీవి ప్రకటించారు. అయితే సినిమా సక్సెస్ తో పాటు కమర్షియల్ గా విజయాన్ని సాధించింది. కొన్ని రోజుల పాటు ఈ సినిమాలపై వివాదం ఏర్పడి విడుదల వాయిదా పడినా.. కొన్ని మార్పులు చేసి మొత్తాన్ని వీటిని రిలీజ్ చేశారు.

అయితే అంతకుముందు ఆర్జీవీ తన సోషల్ మీడియా అకౌంట్లో పవన్ కల్యాణ్ కు పరిటాల రవి గుండు కొట్టించారని తెలుపుతూ ఓ పోస్టు పెట్టారు. అది పెద్ద వివాదంగా మారింది.

అయితే కొందరు ఆ సీన్ రక్త చరిత్రలో పెడుతారని అందరూ భావించారు. ఆ సీన్ తీసేయడానికి వల్లభనేని వంశీనే కారణమని కొందరు ప్రకటించారు. అయితే పవన్ కల్యాణ్ కు సంబంధించిన ఆ సీన్ ను రక్త చరిత్రలో పెట్టడాన్ని వంశీ ఎందుకు వ్యతిరేకించారో ఆయన మాటల్లోనే ఇప్పుడు చూద్దాం..

‘రక్త చరిత్ర సినిమా తీసే సమయంలో వర్మ అందరి దగ్గర ఇన్ పుట్స్ తీసుకున్నారు. నా దగ్గరికి కూడా వచ్చారు. నాకు తెలిసిన కొంత సమాచారాన్ని వర్మకు ఇచ్చాను . అయితే ఆ తరువాత వర్మ పవన్ కల్యాణ్ కు పరిటాల రవి గుండు కొట్టించారిన ఓ పిక్ ను పెట్టాడు. కానీ వాస్తవానికి అలా జరగలేదు.

అసలు పవన్ కు, పరిటాల రవిలు కలసుకోలేనేలేదు. అలాంటప్పుడు ఈ విధంగా ఎందుకు పెట్టావని నేను వర్మను అడిగాను. ఒక మనిషి మీద జరగని పనిని జరిగినట్లు ఎందుకు ఇలా ఆపాదించడం అని నేను వారించాను. దీంతో మా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఆ తరువాత ఆ సీన్ సినిమాలో పెట్టలేదు’ అని వల్లభనేని వంశీ క్లారిటీ ఇచ్చారు.