Begin typing your search above and press return to search.
వంశీ బాబూ!..ఇవి బెదిరింపులు కాక మరేమిటీ?
By: Tupaki Desk | 5 May 2019 4:26 PM GMTటీడీపీ యువ నేత - కృష్ణా జిల్లా గన్నవర్ సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వ్యవహారం ఇప్పుడు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. టీడీపీ నేత అయినప్పటికీ... వైసీపీలో ఉన్న తన మిత్రులతో ఇప్పటికీ మంచి స్నేహసంబంధాలను నెరపుతున్న వంశీపై పెద్దగా ఆరోపణలు లేవనే చెప్పాలి. మొన్నటిదాకా వైసీపీలోనే ఉండి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన వంగవీటి రాధాకృష్ణ - వైసీపీలో కీలక నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిలతో తనకున్న స్నేహాన్ని పార్టీలకు అతీతంగా కొనసాగిస్తూ వస్తున్న వంశీ... నిజంగానే విమర్శలకు దూరంగా ఉన్న నేతగానే చెప్పుకోవాలి.
అయితే ఈ ఎన్నికల్లో తనపై వైసీపీ టికెట్ పై పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావును టార్గెట్ చేసుకుని ఇప్పుడు వంశీ సాగిస్తున్న బెదిరింపుల పర్వంతో ఆయన క్లీన్ ఇమేజీ మసకబారడం ఖాయంగానే కనిపిస్తోంది. యార్లగడ్డకు సన్మానం చేస్తానని - నేరుగా ఆయన ఇంటికే వెళతానని ఇప్పటికే ఫోన్లు చేసిన వంశీ... యార్లగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నోరిప్పక తప్పలేదు. ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించిన వంశీ... యార్లగడ్డకు సన్మానం చేస్తానన్నమాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే... యార్లగడ్డకు వంశీ చేసిన ఫోన్ కాల్స్ బెదిరింపుల కిందకే వస్తాయని చెప్పక తప్పదు.
అయినా వంశీ ఏమన్నారన్న విషయానికి వస్తే... *వైసీపీ అభ్యర్థులు పరిధి దాటి వ్యక్తిగత దూషణకు దిగారు. అందుకే ఎన్నికలైన తర్వాత మీరు చాలా బాగా మాట్లాడారు.. ప్రజాస్వామ్యంగా జరగాల్సిన ఎన్నికల్లో.. అప్రజాస్వామికమైన బాష వాడారని ఉద్దేశంతో నేను వెంకట్రావుతో మాట్లాడాను. అంతేకాదు ఒక శాలువా - ఒక దండ కొన్న మాట వాస్తవమే.. దండేస్తానని నేను చెప్పిన మాట వాస్తవమే. ఇందులో తప్పేముంది..? నేను వెళ్తానన్నది వెంకట్రావ్ ఇంటికే కదా..? సన్మానం చేస్తానన్నాను అంతే. నేను నా అనుచరులను వాళ్లింటికి పంపి.. వెంకట్రావ్ ఉన్నారేమో చూసి రమ్మన్నాను.. అంతే. ఆ సన్మానం ఏంటో వెండితెర మీద చూస్తారు. మొన్న ఎన్నికలప్పుడు కేసులు తప్పితే నామీద ఎలాంటి కేసులు లేవు* అని వల్లభనేని వంశీ చెప్పుకొచ్చారు. మరి ఈ మాటలను బెదిరింపుల కింద కాకుండా ఇంకెలా పరిగణించాలో వంశీనే చెప్పాలన్న వాదన వినిపిస్తోంది.