Begin typing your search above and press return to search.
కేడర్ కోసమే అలా చేశా.. వల్లభనేని వంశీ కామెంట్లు
By: Tupaki Desk | 11 Dec 2021 2:30 AM GMTటీడీపీ రెబల్ ఎమ్మెల్యే, కృష్ణాజిల్లాకు చెందిన నాయకుడు, ఫైర్ బ్రాండ్ వల్లభనేని వంశీ.. తాను ఎందుకు పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చిందో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. పార్టీ మారిన తర్వాత.. 20 రోజులకు కానీ.. తాను నోరు విప్పలేదన్న ఆయన.. తనకు ఎలాంటి ప్రయోజనం లేకుండానే పార్టీని దూరం చేసుకున్నట్టు తెలిపారు. కేవలం పార్టీ శ్రేణుల కోసమే.. తన అభిమానులను అధికార పార్టీ వైసీపీ ఒత్తిడికి గురి చేయకూడదనే ఉద్దేశంతోనే తెలుగు దేశం పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు తెలిపారు. తనకంటే.. లాంటి వ్యక్తిగత ప్రయోజనాలూ లేవని తెలిపారు. ఈ విషయంలో తాను క్లారిటీతోనే ఉన్నానని చెప్పారు.
ఇక, టీడీపీపైనా.. పార్టీ అధినేత చంద్రబాబుపైనా.. తాను పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నోరు విప్పలేదని.. అయితే.. 20 రోజుల తర్వాత మాత్రమే తను నోరువిప్పినట్టు చెప్పారు. దీనికి కూడా కొన్ని `కారణాలు` ఉన్నాయని చెప్పిన వంశీ అవి ఏంటనేది మాత్రం వెల్లడించలేదు. తాను మాత్రం కేసులకు భయపడి పార్టీ నుంచి బయటకు వచ్చి అధికార పార్టీకి మద్దతివ్వలేదని తెలిపారు. రాజకీయాల్లో వ్యూహాలు కామనేనని చెప్పిన ఆయన తనపై ఎలాంటి విమర్శలు వచ్చిన.. భయపడేది లేదని చెప్పారు.
ఇక, తనకు రాష్ట్ర విభజన తర్వాత..ఆస్తుల కోసమే.. ఇలా చేస్తున్నట్టు చెప్పడాన్ని కూడా ఖండించారు. తనకు ఏపీలో ఒక్క సెంటు భూమి కానీ.. ఒక ఎకరం పొలంకానీ లేదన్నారు. కేవలం ఆరోపణలు చేసేవారు.. చేస్తుంటారని అన్నారు. ప్రతి దానికీ తాను భయపడేది లేదన్నారు. వివాదాస్పద భూములు ఏవీ లేవన్నారు. అలాంటిప్పుడు తాను ఎందుకు భయపడతానని చెప్పారు.కేవలం కేడర్ తన వల్ల సమస్యలుఎదుర్కొనకుండా ఉండాలనే ఉద్దేశంతోనే పార్టీ మారినట్టు వంశీ చెప్పుకొచ్చారు. అంతేతప్ప.. తనకు ప్రత్యేకంగా ఎలాంటిప్రయోజనాలు లేవన్నారు. అయితే.. రాజకీయంగా విమర్శలు చేసేవారు చేస్తుంటారని.. ప్రతి వారికీ తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని.. ప్రతి విషయాన్ని బూతద్దంలో చూడాల్సిన అవసరం కూడా లేదని.. వంశీ స్పష్టం చేయడం గమనార్హం.