Begin typing your search above and press return to search.
తెలుగుదేశం ఎమ్మెల్యేల పక్కనే వల్లభనేని వంశీ!
By: Tupaki Desk | 9 Dec 2019 5:22 AM GMTతెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ఆయనను దూషించినంత పని చేశారు. తెలుగుదేశం పార్టీలోని ఇతర నేతలను అయితే డైరెక్టుగా తిట్టేశాడు. తెలుగుదేశం ఎమ్మెల్సీ నారా లోకేష్ ను నానా మాటలూ అన్నారు వల్లభనేని వంశీ మోహన్.
అంతేనా.. తను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్టుగా ఆయన ప్రకటించుకున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం లేదని, తెలుగుదేశం పార్టీకి మాత్రమే రాజీనామా చేసినట్టుగా ఆయన ప్రకటించుకున్నారు. తను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కొనసాగబోతున్నట్టుగా హింట్ ఇచ్చారు.
ఇలాంటి నేపథ్యంలో వల్లభనేని వంశీ మోహన్ అసెంబ్లీకి హాజరవుతారా? అనేది సందేహంగానే నిలిచింది. కానీ, ఆయన అసెంబ్లీకి హాజరయ్యారు. హాజరు కావడమే కాదు.. డైరెక్టుగా వెళ్లి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పక్కనే కూర్చుకున్నారు వంశీ.
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్టుగా ప్రకటించకముందు ఎక్కడకూర్చునే వారో - ఆ చోట్లలోనే వంశీ కూర్చున్నారు. ఇలా తెలుగుదేశం గుంపులోనే కనిపించారు. ఇంతకీ వంశీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్టా? చేయనట్టా? చేసీ చేయనట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే మిగతా తెలుగుదేశం ఎమ్మెల్యేలా వంశీ పచ్చ చొక్కా వేసుకురాలేదు. అయ్యప్ప దీక్షలో ఉన్న ఆయన అందుకు సంబంధించిన నల్ల దుస్తుల్లో సభకు హాజరయ్యారు.