Begin typing your search above and press return to search.
టీడీపీని దెబ్బకొట్టే ప్లాన్..కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు!
By: Tupaki Desk | 19 July 2020 7:30 AM GMTవైఎస్ జగన్ సర్కార్ వ్యూహాత్మకంగా ముందుకెళుతోంది. దీర్ఘకాలిక వ్యూహాలతో సాగుతోంది. టీడీపీని అన్నిరకాలుగా దెబ్బకొట్టే వ్యూహాలను సిద్ధం చేస్తోంది.
తాజాగా వైఎస్ జగన్ ప్రభుత్వం జిల్లాల విభజనకు రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే కమిటీని నియమించింది. 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేయాలనేది ప్రాథమిక అంచనా..
ఈ క్రమంలోనే కొత్త జిల్లాల డిమాండ్ వస్తోంది. తాజాగా గన్నవరం టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరో ఆసక్తికర డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. కృష్ణ జిల్లాకు ఎన్టీఆర్ పేరు మరోమారు తెరపైకి వచ్చింది. వైసీపీ అధికారంలోకి వస్తే కృష్ణ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడుతానని కృష్ణ జిల్లా పాదయాత్రలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే..
ఈ క్రమంలోనే గన్నవరం ఎమ్మెల్యే వంశీ లేవనెత్తారు. కృష్ణ జిల్లా నిమ్మకూరులో జన్మించిన ఎన్టీఆర్ పేరును కృష్ణ జిల్లాకు పెట్టి సీఎం జగన్ ఇచ్చిన మాట నెరవేర్చుకుంటారని అన్నారు.
ఇలా టీడీపీ రెబల్ ఎమ్మెల్యేతోనే తెలుగు దేశం పార్టీ పెట్టిన ఎన్టీఆర్ పేరును కృష్ణ జిల్లాకు పెట్టేలా చంద్రబాబును ఇరుకున పెట్టాలని వైసీపీ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. బాబు చేయలేని పనిని జగన్ చేస్తూ ఆయనను డిఫెన్స్ లో పడేసే వ్యూహంగా కనిపిస్తోంది. మామ ఎన్టీఆర్ ను కూలదోసి అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబుకు ఇప్పుడీ నిర్ణయం మింగుడుపడని అంశంగా మారుతుందని వైసీపీ పెద్దలు ఆశిస్తున్నారు.