Begin typing your search above and press return to search.
బీజేపీ వైపు చూస్తున్న వంశీ ..కేసుల మాఫీకోసమేనా..?
By: Tupaki Desk | 25 Oct 2019 9:36 AM GMTగన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని వీడే ఆలోచనలో ఉన్నారా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కొద్ది రోజుల క్రితమే ఈ ప్రచారం మొదలైన అప్పట్లో ఆ వార్తలని వంశి ఖండించారు. కానీ , ఎన్నికల తరువాత అయన పార్టీ కార్యక్రమాలకి కొంచెం దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా అయన బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో సమావేశం అయ్యారు. సుజనా తో వంశి భేటీ కావడం ఇది రెండోసారి కావడం విశేషం. గతంలో వీరిద్దరి భేటీ జరిగిన అది తన వ్యక్తిగతం అని వంశీ అప్పట్లో చెప్పుకొచ్చాడు.
కానీ , ఇప్పుడు తాజాగా సుజనా తో భేటీ కావడంతో పార్టీ మార్పు ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ .. వైసీపీ ప్రభుత్వం పై నిరసనల కార్యక్రమం నిర్వహిస్తుంటే ..అవేమి పట్టించుకోకుండా వంశీ సుజనాతో భేటీ కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుతుంది. ఇకపోతే ఏపీలో ఎన్నికల తరువాత టీడీపీ పరిస్థితి మరీ దీనస్థితికి చేరడంతో పార్టీలోని కీలక నేతలు మెల్లిమెల్లిగా ఇతర పార్టీలలోకి జంప్ అవుతున్నారు.
ఇప్పటికే పలువురు ఎంపీలతో పాటు, పార్టీ నేతలు కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. అలాగే తాజాగా ఆదినారాయణరెడ్డి కూడా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ..వంశీ వైసీపీ లో చేరతారు అనే ఒక వార్త కూడా ఈ మధ్య కొంచెం గట్టిగానే వినిపించింది. కానీ , వంశీ వైసీపీ లో చేరడాన్ని వైసీపీ కార్యకర్తలు వ్యతిరేకించారు. అలాగే తాజాగా వంశీ పై ఫోర్జరీ కేసు నమోదైంది.దీనితో కేసుల మాఫీకోసమే వంశీ బీజేపీ వైపు చూస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.