Begin typing your search above and press return to search.

పరిటాల సునీతకు వల్లభనేని వంశీ సంచలన కౌంటర్

By:  Tupaki Desk   |   23 Oct 2021 9:44 AM GMT
పరిటాల సునీతకు వల్లభనేని వంశీ సంచలన కౌంటర్
X
మాజీ మంత్రి పరిటాల సునీత వ్యాఖ్యలపై టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందిచారు. గట్టి కౌంటర్ ఇచ్చాడు. వచ్చే ఎన్నికల వరకూ ఎందుకు..? ఇప్పుడే రాజీనామా చేస్తున్నానంటూ ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సవాల్ విసిరారు. అంతేకాదు.. ఖాళీ లెటర్ హెడ్ పై సంతకం చేసి ఇచ్చారు. తాను రాజీనామా చేస్తున్నట్టు రాసి స్పీకర్ కు పంపాలని పరిటాల సునీతకు సూచించారు.

తాను పరిటాల సునీతను వదినగానే చూస్తానన్న వంశీ..కానీ తల్లికి, గర్భస్త శిశువుకు మధ్య గొడవలు పెట్టగలిగినంత తెలివైన వాడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ నే సునీత చదివి ఉంటుందని.. గన్నవరానికో.. గుడివాడకో నేనూ, కొడాలి నాని మొదలు కాదు.. చివర కాదని వంశీ అన్నారు.

చంద్రబాబు భ్రమలు కల్పించి మాట్లాడిస్తారని కామెంట్ చేసిన వల్లభనేని తెలంగాణ సీఎం కేసీఆర్ సన్నిహితులతో ఆయన్ను తిట్టించారు చంద్రబాబు అని విమర్శించారు. కేసీఆర్ తాగుబోతని.. విమర్శలు చేయండని చంద్రబాబు ప్రేరేపించారన్నారు.

మరోవైపు పరిటాల రవిని చంద్రబాబు ఎంత దూరం పెట్టారో అనంతపురం జిల్లాలో అందరికీ తెలుసు అంటూ వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పయ్యావుల, నిమ్మల, ప్రభాకర్ చౌదరితో పరిటాల రవిని తిట్టించిన వైనం మరిచిపోయావా? అంటూ సునీతను వంశీ గట్టిగా నిలదీశారు. సన్నిహితుడైన వర్ల రామయ్యతో కూడా తిట్టించారని విమర్శించారు. కోడెలను పార్టీకి దూరం చేశారని.. పరిటాల రవి చనిపోవడానికి, కోడెల ఆత్మహత్యకు కారణం చంద్రబాబే అని సంచలన ఆరోపణలు చేశారు.

పరిటాల రవి చనిపోవడానికి తాను కారణం కాదని చంద్రబాబు.. తన మనవడు దేవాన్ష్ మీద ఒట్టేయగలరా? అంటూ వంశీ సవాల్ చేశారు. గన్నవరం నుంచి లోకేష్ పోటీచేస్తానంటే నేను రాజీనామా చేస్తారంటూ మరో సవాల్ చేశారు. వదిన పరిటాల సునీతే రాజీనామా పత్రం స్పీకరు పంపొచ్చన్నారు. గన్నవరం సీటును గెలిపించుకోవడానికి పరిటాల సునీత రావాలని సవాల్ చేశారు. 2019లో కొడాలి నానిని ఆమె ఓడించలేకపోయారని.. ఇప్పుడు నన్ను ఓడించే ప్రయత్నం చేయమనండి అంటూ సవాల్ చేశారు. సునీతకు ఇప్పుడే ఎందుకింత కోపం వస్తుందో అని ప్రశ్నించారు. చంద్రబాబే ఆమెతో చెప్పిస్తున్నారా? అన్న అనుమానాలు కలుగక మానవన్నారు.