Begin typing your search above and press return to search.
లండన్ మరోసారి వణికిపోయింది
By: Tupaki Desk | 19 Jun 2017 5:35 AM GMTలండన్ టైం ఏ మాత్రం బాగున్నట్లుగా లేదు. ఒకటి తర్వాత ఒకటిగా చోటుచేసుకుంటున్న ఉదంతాలతో ఆ మహానగరం తల్లడిల్లుతోంది. మొన్నటికి మొన్నజరిగిన ఉగ్రదాడితో చిగురుటాకులా వణికింది. ఇదిలా ఉండగా.. ఇటీవల చోటు చేసుకున్న బహుళ అంతస్తుల భవనంలో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంతో భవనం పూర్తిగా కాలిపోయింది. ఇలా ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న ఘటనలు లండన్ మహానగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా లండన్ లో పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. దీని వెనుక విద్రోహుల కుట్ర ఉందని అనుమానిస్తున్నారు. గతంలో లండన్ ఫిన్స్ బరి పార్క్ లోని సెవెన్ సిస్టర్ రోడ్డులో మసీదు ప్రాంతంలో పాదచారులపై ఒక వ్యాన్ దూసుకెళ్లింది. ఈ తరహా దాడులు లండన్ లో ఇటీవల కాలం ఎక్కువ అయ్యాయి. ఉగ్రవాదులు.. భారీ వాహనాల్ని రోడ్ల మీద ఇష్టారాజ్యంగా పోనిచ్చి.. ఆపై పాదచారులపై దాడి చేస్తూ కలకలం రేపుతున్నారు.
తాజా ఉదంతం కూడా ఇదే రీతిలో ఉండటం గమనార్హం. మసీదుకు సమీపంలో పాదచారులపై వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ఉదంతంలో పది మందికి గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. లండన్ స్థానిక కాలమానం ప్రకారం అర్థరాత్రి 12.20 గంటల ప్రాంతంలో లండన్ మెట్రో పోలీసులకు అందిన సమాచారంతో భద్రతా బలగాలు హుటాహుటిన బయలుదేరాయి. పవిత్ర రంజాన్ మాసంలో రాత్రిపూట ప్రత్యేకంగా నిర్వహించే తరావీ ప్రార్థనల అనంతరం మసీదు నుంచి బయటకు వచ్చే వారిని లక్ష్యంగా చేసుకొని వ్యాన్ ను అమిత వేగంతో దూసుకెళ్లేలా చేశారు. ప్రమాదం జరిగిన సెవెన్ సిస్టర్స్ ప్రాంతంలోకి రాకపోకల్ని మూసివేశారు. ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందా? దీని వెనుక ఏదైనా ఉగ్రకుట్రుందా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇక.. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/