Begin typing your search above and press return to search.
చింతమనేని..వనజాక్షి ఫ్రెండ్సయిపోయారు
By: Tupaki Desk | 27 April 2017 8:14 AM GMTవనజాక్షి.... ఈ పేరు గుర్తుండే ఉంటుంది. ఎమ్మార్వో వనజాక్షి అంటే ఇంకా ఠక్కున గుర్తుకొచ్చేస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో జరిగిన గొడవ.. ఆ వ్యవహారం రాష్రమంతటా చర్చనీయం కావడం తెలిసే ఉంటుంది. ఇసుక రవాణా విషయంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని - ఎమ్మార్వో వనజాక్షిల మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సీరియస్ అయ్యారు. అయితే, తాజాగా వారిద్దరూ మంచి ఫ్రెండ్సయిపోయారట. రీసెంటుగా ఓ కార్యక్రమంలో వారిని చూసిన అధికారులు - నాయకులు కూడా షాకైపోయారట.
పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు బాల సదనం హాస్టల్ లో మేఘన అనే ఓ బాలికను ఈరోజు వనజాక్షి దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి చింతమనేని కూడా హాజరయ్యారు. ముందుగా వనజాక్షికి ఆయన స్వాగతం పలికారు. చింతమనేనికి వనజాక్షే స్వయంగా బొకే ఇచ్చారు.
ఇంకో విషయం ఏంటంటే... విధి నిర్వహణలో భాగంగానే అప్పటి గొడవ జరిగిందని... ఆ గొడవను తాము మర్చిపోయామని వనజాక్షి చెబుతున్నారు. తామిద్దరం దాయాదులం కాదని, శత్రువులం అంతకన్నా కాదని ఆమె అంటున్నారు. నేతలతో గొడవపడి లాభం లేదనుకున్నారో ఏమో కానీ వనజాక్షే రాజీకొచ్చారని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/