Begin typing your search above and press return to search.
వనజాక్షి ఎపిసోడ్ అసలు సీక్రెట్ బయటపెట్టిన చింతమనేని
By: Tupaki Desk | 1 Feb 2022 6:47 AM GMTతెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోమారు తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను తీవ్రంగా ఇరకాటంలో పడేసిన తహశీల్దార్ వనజాక్షి ఉదంతం విషయంలో చింతమనేని ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వనజాక్షి ఉదంతం సృష్టించింది మీడియేనని చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో మాట్లాడిన చింతమనేని ఆ విషయంలో తన వాదన వినిపించే అవకాశం లేకపోయిందని, అందుకే తన విషయంలో తప్పుగా ప్రచారం జరిగిపోయిందని చింతమనేని వాపోయారు.
ఆనాటి గొడవలో వనజాక్షిని కొట్టలేదని తాను చెప్పడం లేదని అయితే, ఆమె పరిధి దాటి ప్రవర్తించిన తీరుతో అలా జరిగిందని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. డ్వాక్రా మహిళల ద్వారా ఇసుక అమ్మకం విషయంలో జరిగిన గొడవను తనకు ఆపాదించారని ఇందులో తనకు ఒక్క శాతం కూడా సంబంధం లేదని తెలిపారు. తాను సీన్లో లేనప్పటికీ తనను దుర్మార్గుడి వలే చిత్రీకరించారని ఆరోపించారు. గొడవకు ముందు వనజాక్షి అక్కడ లేదని పేర్కొన్న చింతమనేని ఈ గొడవ కారణంగా ఆమె ఇమేజ్ సంపాదించి తాము బకారా అయిపోయామని వాపోయారు. ఇలాంటి ఇంటర్వ్యూల్లో వనజాక్షిని తన పక్కన కూర్చోపెడితే బాగుండేదని సెటైర్లు వేశారు.
తనను ఓ దుర్మార్గుడిగా మీడియా తీర్చిదిద్దిందని , తెలుగుదేశం పార్టీ ఓటమికి తాను సైతం ఓ కారణం అనే భావన కలిగించడంలో కూడా మీడియాదే కీలక పాత్ర అని చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. తమ కంటే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎక్కువ అధికారం చెలాయిస్తున్నారని స్థానికంగా ఉండే మీడియా ప్రతినిధులు భావించి తనపై ఈ ముద్ర పడేందుకు కారకులు అయ్యారని మండిపడ్డారు.
అధికారంలో ఉన్నా లేకున్నా తాను ప్రజాసేవలో ఉన్నానని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. కాగా, దీర్ఘకాలం తర్వాత మళ్లీ ఓ మహిళా అధికారి విషయంలో చింతమనేని కీలక వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.