Begin typing your search above and press return to search.
ఫర్లేదు.. ఎట్టకేలకు వనమా రాఘవను పోలీసులు పట్టుకున్నారు
By: Tupaki Desk | 8 Jan 2022 4:30 AM GMTసినిమాల్లో కనిపించే తరహాలో వేధింపులు.. తెర మీద పండించే విలనీకి ఏ మాత్రం తీసిపోని రీతిలో చోటు చేసుకున్న ఒక దారుణం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఆరాచక సంచలనం పేరు వనమా రాఘవేంద్రరావు. 59 ఏళ్ల పడుచు వయసులో.. తన వద్దకు వచ్చిన పంచాయితీలో.. సానుకూల తీర్పురావాలంటే నీ భార్యను ఒంటరిగా నా దగ్గరకు పంపాలన్న పాడు మాట వచ్చిందని.. దాన్ని వినలేని సదరు సామాన్య భర్త.. యావత్ కుటుంబాన్ని తగలపెట్టి.. తాను తగలబడిపోయిన ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
ఈ ఆరాచకానికి కేరాఫ్ అడ్రస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు కుమారుడు వనమా రాఘవేంద్రరావు అన్న ఆరోపణ బలంగా వినిపిస్తోంది. ఆయన అరెస్టుపై పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ.. ఆయన పోలీసులకు దొరక్కుండా తప్పించుకుతిరుగుతున్నట్లు చెబుతున్నారు. గురువారం మధ్యాహ్నం ఆయన్ను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నట్లుగా వార్తలు రావటం.. గంటల తర్వాత అదంతా బోగస్ న్యూస్ రాసినట్లుగా చెప్పటం షాకింగ్ గా మారింది.
అప్పటివరకు పోలీసుల అదుపులో ఉన్నట్లుగా వార్తలు వచ్చిన వనమా రాఘవ.. అసలు తమ వద్ద లేడంటూ పోలీసులు చెప్పటం పెద్ద ట్విస్టుగా మారింది. ఇదే పేరుతో మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే.. తాజాగా రాఘవ అరెస్టుకు సంబంధించిన ఒక వార్త బయటకు వచ్చింది. వనమా రాఘవను ఆంధ్రా.. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ అరెస్టును కన్ఫర్మ్ చేస్తూ కొత్తగూడెం జిల్లా ఎస్పీ సైతం వెల్లడించారు.
రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన దమ్ముపేట వద్ద పోలీసులు వనమా రాఘవను అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. రామక్రిష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నంతనే పరారీ అయినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాఘవేంద్ర గురించి ఆరోపణలు రావటం తెలిసిందే. ఎట్టకేలకు అతన్ని పోలీసులు అరెస్టు చేయటంతో.. ఈ కేసు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లుగా చెబుతున్నారు. దమ్మపేటలో అరెస్టు చేసిన రాఘవను కొత్తగూడెంకు తరలించినట్లుగా చెబుతున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి మరిన్ని విషయాల్ని పోలీసు వర్గాలు మరెప్పుడు వెల్లడిస్తాయో చూడాలి.