Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ కు షాక్...కేసీఆర్ తో వనమా భేటీ
By: Tupaki Desk | 17 March 2019 12:06 PM GMTతెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. ఇంకో ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించారు. అధికార టీఆర్ ఎస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి, టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను ఆయన ఫాంహౌజ్ లో కలిసి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఈ మేరకు బహిరంగ ప్రకటన విడుదల చేశారు. తాజా ఎపిసోడ్ మరోమారు కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది.
ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్తో కొత్తగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు భేటీ అయ్యారు. కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధిపై చర్చిండంతో పాటుగా వివిధ రాజీకయ పరిణామాల గురించి సైతం ఆయన ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా టీఆర్ ఎస్ పార్టీలో చేరేందుకు వనమా తన సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం మీడియాకు వనమా పత్రికా ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ ఎస్ లో చేరతానని వెల్లడించారు.
ఇదిలాఉండగా, కాంగ్రెస్ శాసనసభా పక్షం ఖాళీ దిశగా సాగుతుంది. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యేలు కేసీఆర్ ను కలిసి ఆయన నాయకత్వంలో పనిచేస్తామంటూ తమ ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు పది మంది ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లో చేరనున్నట్లుగా ప్రకటించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు. వీరితో పాటుగా మరికొందరు ఆదే దారిలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ జాబితాలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు చేరడం గమనార్హం.