Begin typing your search above and press return to search.
వావ్ అనేలా 'వందే భారత్' రైల్లో వసతులు..ఏమేమంటే?
By: Tupaki Desk | 10 Sep 2022 1:30 PM GMTఅగ్రరాజ్యం దిశగా దూసుకెళుతున్నామని పాలకులు చెబుతున్నా.. కనీస మౌలిక సదుపాయాల విషయంలో మనం ఎంత దరిద్రపు పరిస్థితుల్లో ఉన్నామో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మిగిలిన విషయాలు ఎలా ఉన్నా నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశీయ రైల్వేలు కొత్త రూపురేఖలు సంతరించుకుంటాయని.. కీలక పరిణామాలు చోటు చేసుకోవటంతో పాటు.. రైల్వేలు మరింత దగ్గర అవుతాయన్న అంచనాలు ఉండేవి. కానీ.. అలాంటివేమీ జరగకపోగా.. కరోనా వేళ రద్దు చేసిన రాయితీలు నేటికి పునరుద్ధరించకపోవటం తెలిసిందే.
మోడీ సర్కారు కొలువు తీరిన తర్వాత బులెట్ ట్రైన్ హడావుడి కాస్తంత జరిగినా.. ఆ ప్రాజెక్టు సాగుతూనే ఉంది తప్పించి.. బుల్లెట్ స్పీడ్ ఎక్కడా కనిపించని పరిస్థితి.
ఇలాంటివేళ.. మెరుగైన సౌకర్యాలతో అందుబాటులోకి తెస్తున్న వందే భారత్ హైస్పీడ్ రైళ్లను త్వరలో పట్టాలకెక్కించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ రైళ్ల ప్రత్యేకత ఏమంటే గంటకు 180కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.
అత్యుత్తమ అప్ గ్రేడ్ సౌకర్యాల్ని ఈ రైల్లో ఇస్తారని చెబుతున్నారు. ప్రభావవంతమైన ఏసీలు.. డస్ట్ ఫ్రీ క్లీన్ ఎయిర్ కూలింగ్ ట్రాక్షన్ మోటారు కారణంగా ప్రయాణికుల జర్నీ మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ ట్రైన్ లో 32అంగుళాల ఎల్సీడీ టీవీల్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఇందులో వైఫై సౌకర్యం కూడా ఉండనుంది.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2023 నాటికి 75 వందే భారత్ ట్రైన్లను అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. విన్నంతనే ఈ రైలు ఎప్పుడు ఎక్కుదామా? అన్నట్లుగా ఉన్నప్పటికి.. మోడీ మార్కు పాలనలో ఇన్నేసి వసతులతో రైళ్లను తెస్తున్న వేళ.. వీటి ఛార్జీలు ఎంత భారీగా ఉంటాయన్నది అసలు ప్రశ్న.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.