Begin typing your search above and press return to search.
టీడీపీ పగ : వైసీపీ మాజీ మంత్రికి సెగ తప్పదా...?
By: Tupaki Desk | 16 July 2022 2:30 AM GMTరాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చాలా కామన్. అవి కూడా ప్రజా సమస్యలకే పరిమితం అయిన ఉన్న కాలం అత్యుత్తమైననది. ఇక నాయకులు ఎదురు బొదురు కనిపిస్తే నవ్వుకుని కులాసాగా కబుర్లు చెప్పుకునే గోల్డెన్ డేస్ గతించాయి. ఇపుడు అంతా అరాచకమే. ఒకరి మీద మరొకరు నిందించుకోవడమే. దారుణంగా పగ పట్టేసినట్లుగా టార్గెట్ చేయడమే. మాటలు దాటి చేతలకు కధ సాగిపోతున్న వేళ ఈ రోజు వైసీపీ అధికారంలో ఉంది. రేపటి రోజున టీడీపీ వస్తే ఇపుడున్న వారి పరిస్థితి ఏం కానూ అన్న చర్చ అయితే అపుడపుడు సాగుతూనే ఉంటుంది.
అయితే దానికి జవాబు కూడా ఏ మాత్రం ఇబ్బంది పడకుండా టీడీపీ వారే ఇస్తున్నారు. అధినాయకుల నుంచి మామూలు నేతల దాకా అంతా తాము వస్తే జనాలకు ఏం చేస్తామో చెప్పడం లేదు కానీ రాజకీయ ప్రత్యర్ధుల ఆట కట్టించేస్తామని పదే పదే హెచ్చరిస్తున్నారు అంతే కాదు, వైసీపీ ఏలుబడిలో అతి చేసిన అధికారుల లిస్ట్ కూడా రెడీ చేసుకుని దగ్గర పెట్టుకున్నామని అంటున్నారు. మొత్తానికి టీడీపీలో కొత్త హోం మంత్రి ఎవరో కానీ చాలా పని ఉన్నట్లే ఉంది.
ఇదంతా ఎందుకు అంటే టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత లేటెస్ట్ గా ఓపెన్ హార్త్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో చాలా విషయాలు మాట్లాడినట్లున్నారు. అందుకో కొన్ని సంచలన విషయాలు అయితే ప్రొమో రూపంలో రిలీజ్ చేసి అలా వదిలారు. అవి ఇపుడు ఏపీ రాజకీయాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అందులో ఏముంది అంటే తమ పార్టీ అధికారంలోకి వస్తే ఫస్ట్ టార్గెట్ కొడాలి నాని అనే చెప్పేశారు.
ఆయన మాజీ మంత్రి. అయితే మంత్రిగా ఉన్నపుడు చాలానే మాట్లాడారు అని అసభ్య పదజాలానికి ఆయన పేటెంట్ హక్కులు పొందారని కూడా ఆమె అన్నారు. ఇప్పటికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాని తనకు ఎంత పడితే అంత మాట్లాడం వచ్చు అంటే కుదురుతుందా అన్నదే అనిత లా పాయింట్. ఇక దీని మీద యాంకర్ స్థానంలో ఉన్న ఆర్కే ఆయన్ని కొడతారా అని ప్రశ్నించగా లేదు అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది అని చెబుతారు.
అంటే కొడాలి నానికి చట్ట పరిధిలోనే శిక్షిస్తారు అన్న మాట. దీన్ని బట్టి చూస్తే ఈ రోజు వైసీపీ ఏలుబడిలో టీడీపీ నేతల అరెస్ట్ ని అంతా చూస్తున్నారు. చర్చించుకుంటున్నారు. రేపటి రోజున టీడీపీ అధికారంలోకి వస్తే ఇదే తీరున రివర్స్ లో వైసీపీ నేతల అరెస్టులు కూడా ఉంటాయన్న మాట. మొత్తానికి ఈ ఫైర్ బ్రాండ్ టీడీపీ ఫస్ట్ టార్గెట్ ఎవరో చెప్పేశారు.
ఇక కొడాలి నాని పొరపాటున అయినా టీడీపీ అధికారంలోకి రాకూడదు అని కోరుకోవాలేమో. లేకపోతే దేనికైనా రెడీ అని ప్రిపేర్ కావాలేమో. ఇక అనిత 2014 ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి 2,800 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి, కొవ్వూరుకు మారిన తర్వాత 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. 2024లో మరోసారి పాయకరావుపేటకు వెళ్లాలని చూస్తోంది. ఇది వైసీపీ మీద అనిత ధర్మాగ్రహమని ఈ ప్రొమో చెప్పిన కధ.