Begin typing your search above and press return to search.

టీడీపీ బైట్ : హోం మంత్రి రాజీనామా ? అనిత ప‌ట్టు !

By:  Tupaki Desk   |   1 May 2022 4:37 PM GMT
టీడీపీ బైట్ : హోం మంత్రి రాజీనామా ? అనిత ప‌ట్టు !
X
ఎవ‌రు ప‌ద‌వికి ప‌నికి వ‌స్తారో ప్ర‌జలే తేలుస్తారు .. ఈ మాట బాధ్య‌త గ‌ల మంత్రి చెబుతున్నారు. బాగుంది. ఆమె హ‌యాంలో ప‌ద‌వి అందుకున్న కొద్ది రోజుల్లోనే దారుణాతి దారుణంగా వ్య‌వ‌స్థ‌లు ఉన్నాయి. అయ్యో ! అని అరిస్తే త‌ప్పు ! అన్యాయం అంటే త‌ప్పు ! రాజ‌కీయ హ‌త్య‌ల‌కూ వైసీపీ శాస‌న స‌భ్యుల ప్ర‌మేయం పై అనుమానాలు ఉన్నాయ‌ని అభియోగాలు గురించి రాస్తే త‌ప్పు ! మీడియా వ‌ల్లే ఇదంతా అని అంటారే ! కానీ వాస్త‌వాలు గుర్తించ‌ని వైనంలో వైసీపీ మంత్రులు ఉన్నారు. గుంటూరు లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై కంటితుడుపు స్టేట్మెంట్లు అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానీ ఇటు హోం శాఖ‌ను చూసే మంత్రి కానీ ఇవ్వ‌డం అన్న‌ది టీడీపీ త‌ప్పు ప‌డుతోంది. ప్ర‌జా ఉద్య‌మాల‌ను అణిచివేసే ఉత్సాహం మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు ఎందుకు లేకుండా పోతోంద‌ని ప్ర‌శ్నిస్తోంది.

గ‌తంలో ఆమె లెక్చ‌ర‌ర్. కొవ్వూరు కేంద్రంగా ఆమెది ఒక రాజ‌కీయ కుటుంబ నేప‌థ్యం. అంత చిన్నాచిత‌కా వ్య‌క్తి కాదు. ఆమె చ‌దువుకున్నవారు. ఎంఎస్‌సీ చ‌దువుకున్న‌వారు. ఓ విధంగా కాస్తో కూస్తో మిగ‌తా వారి క‌న్నా బాధ్య‌త‌గా ఉండాల్సిన వ్య‌క్తి. కానీ ఆమె మాటలు మాత్రం ఎప్పుడూ వివాదాల‌కు తావిస్తూనే ఉన్నాయి. ఆమెకు విష‌యావ‌గాహన లేద‌ని తేలిపోయిన సంద‌ర్భాలు ఎన్నో ! ఆమె పేరు తానేటి వ‌నిత. రాష్ట్ర హోం మంత్రి. మ‌హిళ‌లు అన్ని రంగాల్లో రాణించాలి. అవ‌కాశాలు సద్విన‌యోగం చేసుకుని తీరాలి. కానీ ఆమె మాత్రం అస్స‌లు క‌నీస ప‌రిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. అందుకే టీడీపీ ఆమె రాజీనామా చేయాల‌ని ప‌ట్టుబ‌డుతోంది. ఓ మ‌హిళ హోం మంత్రి గా ఉంటూ కూడా మ‌హిళ‌ల మాన, ప్రాణాల‌కు ర‌క్ష‌ణ లేద‌ని మాజీ ఎమ్మెల్యే అనిత ఫైర్ అవుతున్నారు.

ఏం జ‌రిగినా అందుకు మీడియాదే త‌ప్పు అన్న విధంగా మాట్లాడ‌డం త‌ప్పు. గుంటూరు జిల్లాలో వ‌రుస ఘ‌ట‌న‌లు ఖాకీల వైఫ‌ల్యాల‌ను చాటుతున్నా, అవి కూడా రాయ‌డం, మాట్లాడ‌డం మీడియా త‌ప్పు. తాజాగా రేప‌ల్లె లో ఓ అత్యాచార ఘ‌ట‌న చోటుచేసుకుంది. దానిపై కూడా మంత్రి వ‌నిత తానేటి స్పందించిన తీరు అస్స‌లు బాలేదు. ఎందుకంటే ఆమె చెబుతున్న మాట‌ల‌కు, పోలీసులు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌కు అస్స‌లు సంబంధ‌మే లేదు. పిల్ల‌ల విష‌య‌మై తాను మాట్లాడిన మాట‌ల‌ను మీడియా వ‌క్రీక‌రించింద‌ని ఆమె అంటున్నారు. పోనీ చిన్నారుల భ‌ద్ర‌త విష‌య‌మై త‌ల్లులే జాగ్ర‌త్త వ‌హించాలి అని చెప్పాల‌నే అనుకున్నారు అని భావిద్దాం, అలాంట‌ప్పుడు ఆ రెండు మాట‌లు అయినా స్ప‌ష్టం గా చెప్పాలి. ఆమె బాధ్య‌త ఉన్న మంత్రి. ఆమె ఏం చెప్పినా చెల్లుతుంది అని అనుకోవ‌డం భ్ర‌మ.